iDreamPost
android-app
ios-app

Venkatesh & Rana : వెంకీ రానాలు మరోసారి కలిసి చేస్తారా

  • Published Feb 02, 2022 | 11:02 AM Updated Updated Feb 02, 2022 | 11:02 AM
  • Published Feb 02, 2022 | 11:02 AMUpdated Feb 02, 2022 | 11:02 AM
Venkatesh & Rana : వెంకీ రానాలు మరోసారి కలిసి చేస్తారా

ఇటీవలే హాట్ స్టార్ లో విడుదలైన బ్రో డాడీ ఓటిటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అఖండ తర్వాత సౌత్ నుంచి ఎక్కువ వ్యూస్ వచ్చిన మూవీగా రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా మోహన్ లాల్ పృథ్విరాజ్ కాంబినేషన్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సురేష్ బాబు నిర్మాతగా వెంకటేష్ రానా కలయికలో తీస్తే బాగుంటుందన్న అభిప్రాయం టీమ్ లో వ్యక్తమవుతోందట. అందుకే ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అఫీషియల్ నోట్ రాలేదు కానీ ఇటీవలి కాలంలో సురేష్ సంస్థ హిట్ రీమేకుల పట్ల చాలా ఆసక్తి చూపిస్తోంది.

నారప్ప, దృశ్యం 2 అలా వచ్చినవేగా. ఇప్పుడీ బ్రో డాడీని కూడా మన ప్రేక్షకులకు అందించాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఇందులో రిస్క్ లేకపోలేదు. ఈ సినిమాలో ఉన్న మెయిన్ థీమ్ తల్లికి, వయసొచ్చిన కొడుకు ప్రియురాలికి ఒకేసారి గర్భం దాల్చడం అనే పాయింట్ ని మనవాళ్ళు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో అనుమానమే. ఇలాంటి ప్రయోగం గతంలో జగపతిబాబు చేసి డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫాదర్ ఉమా చిట్టి కార్తీక్ దారుణంగా బోల్తా కొట్టింది. ఒకే కథ కాకపోయినా పోలికలు ఉన్నాయి. బ్రో డాడీని ఆదరించారు కదా అని మళ్ళీ అదే తీస్తే థియేట్రికల్ గా అంతగా వర్కౌట్ కాకపోవచ్చు కానీ డిజిటల్ అయితే ట్రై చేయొచ్చు.

వెంకీ రానా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీని షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టేనని టాక్. ఈ ఏడాది తొలి సగంలోనే స్ట్రీమింగ్ చేస్తారు. మరి ఇంత తక్కువ గ్యాప్ లో మరోసారి కలిసి నటిస్తారా అంటే చెప్పలేం. గతంలో సురేష్ బాబు హిందీలో హిట్టయిన అజయ్ దేవగన్ సినిమా దే దే ప్యార్ దేని తెలుగులో వెంకటేష్ తో తీయాలని గట్టిగానే ట్రై చేశారు. కానీ ఎందుకో అది స్క్రిప్ట్ వర్క్ సగం అయ్యాక ఆపేశారు. బహుశా ఇది మన ఆడియన్స్ కి కనెక్ట్ కాదనుకున్నారేమో. మరి బ్రో డాడీకి సాహసం చేస్తారా అంటే వేచి చూడాలి. ఒకవేళ థియేటర్ వద్దనుకుంటే ఓటిటి కోసమైతే నిక్షేపంగా తీయొచ్చు. చూస్తారు కూడా

Also Read : Megastar : మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా ?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom