iDreamPost
android-app
ios-app

వేమిరెడ్డి చొరవ – చింతపండు పై జీఎస్టీ మినహాయింపు

  • Published Nov 15, 2019 | 2:02 AM Updated Updated Nov 15, 2019 | 2:02 AM
  • Published Nov 15, 2019 | 2:02 AMUpdated Nov 15, 2019 | 2:02 AM
వేమిరెడ్డి చొరవ – చింతపండు పై జీఎస్టీ మినహాయింపు

ఆర్ధిక హోదా తో సంభందం లేకుండా అన్ని వర్గాల వారికి నిత్యావసరమైన వస్తువు చింతపండు. దీనిపై కేంద్రం పన్ను విధించింది. ఫలితంగా ధర పెరిగి సామాన్యులు ఎదుర్కోనున్న నేపథ్యంలో వైఎస్సార్ సిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సరైన సమయంలో స్పందించారు. చింతపండు పై జీఎస్టీ ఎత్తి వేయాలని కేంద్రానికి లేఖ రాసారు. వేమిరెడ్డి విజ్ఞప్తి పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జీఎస్టీ ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి వెమిరెడ్డికి తెలుపుతూ లేఖ రాసారు.
ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయించాని విజ్ఞప్తి చేస్తూ జూలై 24న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్‌ సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్‌ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి అనురాగ్‌ ఠాకూర్‌ గురువారం ప్రత్యుత్తరం పంపారు. సెప్టెంబర్‌ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş