iDreamPost
android-app
ios-app

Varun Tej : పాన్ ఇండియా బాటలో వరుణ్‌తేజ్‌.. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ నేపధ్యంలోనే?

Varun Tej : పాన్ ఇండియా బాటలో వరుణ్‌తేజ్‌.. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ నేపధ్యంలోనే?

మెగా హీరో వరుణ్‌తేజ్‌ వరుస సినిమాలను చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వరుణ్ ఇప్పటికే గని అనే స్పోర్ట్స్ డ్రామాతో పాటు, F3 అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో సినిమాలో నటిస్తుండగా.. మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. నిజానికి వరుణ్ తేజ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అందుకే ఆయన చేసిన అన్ని సినిమాల్లోనూ వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది.. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ ఒక పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ పాన్ ఇండియా సినిమా 2019లో భారత ప్రభుత్వం చేపట్టిన బాల కోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంగా సాగుతున్నట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలోనే ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి వరుణ్ తేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక ఒక ఆర్మీ, లేదా వైమానిక దళానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీంతో నిర్మాత కోసం చూస్తున్నారని చెబుతున్నారు అది కూడా ఫైనల్ అయితే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

2019 ఫిబ్రవరి 26న నియంత్రణ రేఖ వెంట భారత్ సైనికేతర, నిఘా వర్గాల రహస్య ఆపరేషన్ చేపట్టింది. వివిధ వైమానిక స్థావరాల నుంచి బయలుదేరిన భారత వైమానిక దళంలో మిరాజ్-2000 యుద్ధ విమానాలు బాలాకోట్ లో దాడులు చేశాయి. తమ విమానాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్సులోని బాలాకోట్‌లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ గ్రూపుకు చెందిన ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై క్షిపణులతో దాడి చేశాయని భారత వైమానిక దళం ప్రకటించింది. ఆ వైమానిక దాడుల్లో భారీ సంఖ్యలో జైష్ ఏ మొహమ్మద్ గ్రూపుకు చెందిన సీనియర్ కమాండర్లు హతమయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. గతంలో ఇలాంటి కథా నేపథ్యంలో తెరకెక్కిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండనుందనేది.

Also Read : Radhe Shyam : ప్రభాస్ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి 

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklasMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş