ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందించే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం గడువు నేటితో (గురువారం)తో ముగియనుంది. అర్హత ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది బుధవారం రాత్రి వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఫిట్‌నెస్, మరమ్మతులు, బీమా ఖర్చులకు ఏటా రూ.10 వేల వంతున ఐదేళ్లకు రూ.50 వేలు ఇస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,75,352 దరఖాస్తులు అందగా, 1,73,102 మందిని అర్హులుగా ఎంపిక చేసి, ఈ నెల 5న వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు.