iDreamPost
android-app
ios-app

యూఎస్‌ ఓపెన్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌

యూఎస్‌ ఓపెన్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌ నిలిచాడు. ఫైనల్ లో జ్వెరెవ్‌పై విజయం సాధించిన థీమ్ ఆస్ట్రియా నుంచి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. థీమ్ ఖాతాలో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. గతంలో నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయిన డొమినిక్ థీమ్ ఈసారి మాత్రం యూఎస్ ఓపెన్ గెలిచి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.2018, 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన థీమ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచాడు.

డొమినిక్ థీమ్ మరియు జ్వెరెవ్‌ల మధ్య తుదిపోరు అత్యంత హోరాహోరీగా సాగింది. తొలి రెండు సెట్లలో జ్వెరెవ్‌ దూకుడు కనబరుస్తూ 2-6, 4-6,తో థీమ్ పై పైచేయి సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికి డొమినిక్ థీమ్ వెనుకడుగు వేయలేదు. మూడో సెట్ నుండి పుంజుకున్నాడు. 4-6, 6-3, 7-6 తో వరుసగా మూడు సెట్లు గెలిచి యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆటగాడు పుంజుకొని టైటిల్‌ నెగ్గడం యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.