iDreamPost
android-app
ios-app

మళ్లీ రిషబ్ పంత్‌ను టార్గెట్ చేసిన ఊర్వశి రౌతేలా, ‘ఛోటు భయ్యా, బ్యాట్ బాల్ తో ఆడుకో’

  • Published Aug 12, 2022 | 3:43 PM Updated Updated Aug 12, 2022 | 4:13 PM
  • Published Aug 12, 2022 | 3:43 PMUpdated Aug 12, 2022 | 4:13 PM
మళ్లీ రిషబ్ పంత్‌ను టార్గెట్ చేసిన ఊర్వశి రౌతేలా, ‘ఛోటు భయ్యా, బ్యాట్ బాల్ తో ఆడుకో’

ఊర్వశి రౌటేలా, రిషబ్ పంత్( Rishabh Pant) కొంతకాలం క్రితం రహస్యంగా ఎఫైర్ న‌డిపార‌ని గుస‌గ‌స‌లు వినిపించాయి. కాని, ఈ రిలేష‌న్ కొంత‌కాల‌మే కొన‌సాగింది. ఇద్ద‌రూ విడిపోయారు. కాస్త ఆరోప‌ణ‌లు, గొడ‌వ‌లు. మొత్తానికి ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం అంత‌ సామరస్యపూర్వకంగా ఎండ్ కాలేదు. అదంతా ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా పోస్టుల్లో, కొన్నిఇంటర్వ్యూలలో క‌నిపిస్తూనే ఉంటుంది. ఈసారి, రిషబ్ పంత్ ఈసారి ఊర్వ‌శి పోస్ట్ కు రియాక్ట్ అయ్యాడు.

రిషబ్ పంత్‌పై ఊర్వశి రౌతేలా ఇంటర్వ్యూ

గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్‌ పంత్‌ ఎయిర్‌ పోర్ట్‌లో గంటల తరబడి వేచి చూశాడని గాసిప్స్ వినిపించాయి. లేటెస్ట్ గా బాలీవుడ్ హంగామాకి ఊర్వశి రౌతేలా ఇంట‌ర్వ్య‌నిచ్చింది. ఇందులో పేరుచెప్ప‌కుండానే అర్ధ‌మైయ్యేలా రిష‌బ్ పంత్ మీద కామెంట్స్ చేసింది. వారణాసిలో షూటింగ్ అయిపోయిన త‌ర్వాత‌, 10 గంటల మరో షూట్ కోసం ఢిల్లీ వెళ్లానని, ఆ జ‌ర్నీలో అల‌సిపోయి ప‌డుకున్నా. ఆ తర్వాత తన హోటల్ లో లేచిచేసేస‌రికి, మిస్టర్ ఆర్‌పి (అంటే రిషబ్ పంత్ ) తన కోసం హోటల్ లాబీలో ఎదురుచూస్తున్నాడ‌ని, అప్ప‌టికే అత‌ని నుంచి 16-17 మిస్డ్ కాల్స్ వచ్చాయి, ఈ సంగ‌తి త‌న‌కు తెలియ‌దని చెప్పింది. ఇది త‌న‌కు చాలా బాధ కలిగించింది, అయ్యో, ఇలా జ‌రిగిందేంట‌ని, గౌర‌వంగా అత‌న్ని కాంటాక్ట్ చేశాన‌ని చెప్పింది. అక్క‌డే ఇంకో మాట‌కూడా అంది. అలాంటి స‌మ‌యాల్లో చాలా మంది అమ్మాయిలు వేరెవ‌రైనా వెయిట్ చేసినా పట్టించుకోరు. కాని తాను మాత్రం అత‌ను ఎప్పుడు ముంబైకి వ‌చ్చినా వీలైనప్పుడు క‌లుస్తాన‌ని ఒప్పుకుందంట‌.

ఇక ఊర్వశి రౌతేలా కామెంట్స్‌ వైరల్‌ కావడంతో రిషబ్ పంత్ ఇన్ స్టాలో రియాక్ట్ అయ్యాడు. “కొంద‌రు పాపులారిటీ కోసం, హెడ్ లైన్స్ లో ఉండ‌టంకోసం ఇంటర్వ్యూలలో ఎలా అబద్ధాలు చెబుతారు అనేది తమాషాగా ఉంటుంది. కొంతమందికి కీర్తి కోసం, పేరు కోసం చాలా ఆరాటంగా ఉండ‌టం విచారకరం. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు . దు ప్లీజ్‌అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్‌ ట్యాగ్ ఇచ్చాడు.(“merapichachorhoBehen #Jhutkibhilimithotihai”) కాని ఆ త‌ర్వాత డిలీట్ చేశాడు.

అంతే, రిషబ్‌ పోస్ట్‌పై ఊర్వశి రౌతేలా మండిపడింది. పంత్‌ను కౌగర్‌ హంటర్ అంటూ పంత్‌కు చురకలు వేసింది. ‘చోటూ భయ్యా నువ్వు బ్యాట్‌ బాల్‌తో ఆడుకో. నీ లాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి నేను మున్నిని కాదు.’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతేకాదు ఈ పోస్ట్‌కు #RPChotuBhaiyya #Cougarhunter #donttakeadvantageofasilentgirl #love #UrvashiRautela #UR1హ్యాష్ టాగ్స్ ఇచ్చింది. ఇప్పుడు ఊర్వశి రౌతేలా స్ట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌.


ఈ లెక్క‌న రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా గొడ‌వ ఎంత దూరం వెళ్తుందో!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio