iDreamPost
android-app
ios-app

ఉప్పెన భామకు కఠిన పరీక్ష

  • Published Sep 17, 2022 | 6:13 PM Updated Updated Dec 05, 2023 | 1:35 PM

వాటిలో హిట్లెన్ని లెక్కలే మార్కెట్ ని శాశిస్తాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ రూపంలో డీసెంట్ హిట్ దక్కింది.

వాటిలో హిట్లెన్ని లెక్కలే మార్కెట్ ని శాశిస్తాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ రూపంలో డీసెంట్ హిట్ దక్కింది.

ఉప్పెన భామకు కఠిన పరీక్ష

సక్సెస్ మీద ఆధారపడే పరిశ్రమలో కెరీర్ ముందుకా వెనక్కా అనేది నిర్ణయమవుతుంది. మనం ఎన్ని మంచి సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు. వాటిలో హిట్లెన్ని లెక్కలే మార్కెట్ ని శాశిస్తాయి. ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ రూపంలో డీసెంట్ హిట్ దక్కింది. అందులో నానితో లిప్ లాక్ చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఎక్కువ క్రెడిట్ సాయిపల్లవికే వెళ్లినా కృతికి వచ్చిన నష్టమేమీ లేదు. కట్ చేస్తే మూడోది నాగచైతన్యతో బంగార్రాజులో ప్రెసిడెంట్ గా కొత్త తరహాలో కనిపించింది. సంక్రాంతి ఊపులో టాక్ కొంచెం అటు ఇటు ఉన్నా ఫైనల్ గా బొమ్మ హిట్టు స్టాంపు వేయించుకుని హ్యాపీగా బయటపడింది.

ఇదంతా ఒక వైపు. కేవలం మూడే నెలల వ్యవధిలో కృతి శెట్టి మూడు షాకులు తగలడం అభిమానులను తెగ ఫీలయ్యేలా చేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ది వారియర్ చేస్తే అది అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సరే కమర్షియల్ కంటెంట్ తో నితిన్ గట్టి నమ్మకం పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం మీద బోలెడు ఆశలు పెట్టుకుంటే అదీ బోల్తా కొట్టింది. తాజాగా సుధీర్ బాబుతో జట్టు కట్టిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో టైటిల్ రోల్ పోషించినా రిజల్ట్ మాత్రమే మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది.. టాక్, రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. సోమవారం నుంచి గమనించాలి

ఇలా వరుసగా హ్యాట్రిక్ వైఫల్యాలు పలకరించడమంటే చిన్న విషయం కాదు. ఓవర్ నైట్ డిమాండ్ పెరిగిపోయి రెమ్యునరేషన్ కోటిని టచ్ చేసుకున్న కృతికి ఇప్పుడీ పరిణామాలు జీర్ణించుకోలేనివే. ఇప్పుడు తను చేస్తున్న సినిమాలు రెండున్నాయి. మొదటిది నాగచైతన్యతో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో. ఇందులో ఆత్మ టైపులో ఏదో డిఫరెంట్ క్యారెక్టరనే టాక్ ఉంది కానీ అది ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో వేచి చూడాలి. శివపుత్రుడు, నేనే దేవుణ్ణి లాంటి కల్ట్ మూవీస్ ఇచ్చిన బాలా దర్శకత్వంలో సూర్య జోడిగా నటిస్తున్న అచేలుడులో కూడా కృతికి రెగ్యులర్ హీరోయిన్ పాత్ర ఉండదు. ఈ రెండూ కనక తనకు మళ్ళీ బ్రేక్ ఇస్తే సమస్యలేం ఉండవు

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al