iDreamPost
android-app
ios-app

ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన రసాయన ‘ నోబెల్ ‘

ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన రసాయన ‘ నోబెల్ ‘

రసాయన శాస్త్రంలో విశేష సేవలు అందించిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకంగా నోబెల్ బహుమతి-2020 వరించింది.”జీనోమ్‌ ఎడిటింగ్‌” విధానంలో చేసిన పరిశోధనలకు గాను ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌ ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌,అమెరికన్‌ బయోకెమిస్ట్‌ జెన్నీఫర్‌ ఏ దౌడ్నా సంయుక్తంగా నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

ఇరువురు మహిళా శాస్త్రవేత్తలు స్ట్రెప్టోకోక‌స్ బ్యాక్టీరియం ఇమ్యూన్ వ్యవస్థను అధ్యయనం చేసి జ‌న్యువుల‌ను వేరు చేసేందుకు ఓ కొత్త ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేశారు. జీనోమ్ ఎడిటింగ్ టెక్నాల‌జీతో చాలా ప‌దునైన సీఆర్ఐఎస్‌పీఆర్/సీఏఎస్9 జెనెటిక్ సిజర్స్‌ను అభివృద్ధి ప‌రిచారు.ఈ విధానం ద్వారా జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను మార్చగలిగే అవకాశం ఉంటుంది.ఎలాంటి DNA క‌ణానైన అత్యంత‌ నియంత్రిత ప‌ద్ధతిలో క‌త్తిరించ‌వ‌చ్చని శాస్త్రవేత్తలు ఇమ్మాన్యూయెల్, జెన్నీఫ‌ర్ నిరూపించారు.

ఈ కొత్త సాంకేతికత క‌ణ‌జీవ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. వైర‌స్‌ల‌లో ఉండే డీఎన్ఏల‌ను కూడా నూతనంగా కనుగొన్న సీఆర్ఐఎస్‌పీఆర్ జెనెటిక్ సీజ‌ర్లు వేరు చేయగలవు.ఇక వంశ‌పారంప‌ర్యం కారణంగా వ‌చ్చే వ్యాధుల‌ను ఈ నూతన జెనెటిక్ సీజ‌ర్లతో న‌యం చేసే అవ‌కాశం ఉంది.అలాగే క్యాన్సర్ చికిత్సలోను నూత‌న విధానాల అభివృద్ధికి వీరి పరిశోధనలు దోహద పడతాయని నోబెల్ ప్రైజ్ క‌మిటీ పేర్కొంది.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş