iDreamPost
android-app
ios-app

హుజూర్నగర్ లో టిఆర్ఎస్ రికార్డు

హుజూర్నగర్ లో టిఆర్ఎస్ రికార్డు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. 16వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి సైదిరెడ్డి 32 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగతున్నారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్‌లోనే ఆ మెజారిటీని అధిగమించాడు. అయితే ఇంకా ఆరు రౌండ్ల కౌంటింగ్‌ మిగిలి ఉండటంతో.. ఆయన మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.