iDreamPost
android-app
ios-app

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. ఫైనల్ చేసిన కేసీఆర్..

  • Published May 18, 2022 | 6:22 PM Updated Updated May 18, 2022 | 6:22 PM
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. ఫైనల్ చేసిన కేసీఆర్..

త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.

హెటిరో డ్రగ్స్‌ అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌ రావు పేర్లను సీఎం కేసీఆర్‌ ఎంపిక చేశారు. టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ గతేడాది డిసెంబర్‌లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఖాళీ అయిన స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం వీరిలో ఎవరు పోటీ చేస్తారో ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగుస్తుండటంతో ఆ స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు ఈ రెండు స్థానాలకు పోటీ చేయనున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş