కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమాకు హరహర మహాదేవ్ టైటిల్ ని లాక్ చేసినట్టుగా వచ్చిన వార్తలో కొద్దిగా మార్పు చోటు చేసుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. హరహర వీరమల్లుగా పవర్ స్టార్ ని చూపించబోతున్నట్టు తెలిసింది. ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. రెండు పేర్లు ముందు నమోదు చేశారని అయితే గతంలో హరహర మహాదేవ్ ప్రాజెక్ట్ ని బాలకృష్ణ మొదలుపెట్టి ఆపేసిన నేపథ్యంలో కథకు సరితూగేలా వీరమల్లుకే ఓటు పడిందట. పవన్ కూడా దీనికే సానుకూలంగా ఉన్నట్టు యూనిట్ వర్గాల సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.
భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో మెయిన్ పాయింట్ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందట. దాన్ని దొంగతనం చేసి భారతదేశానికి తీసుకొచ్చే ఎపిసోడ్ ఓ రేంజ్ లో గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశారట. స్వతంత్రం రాకముందు జరిగే కథ కాబట్టి భారీ సెట్లు కూడా వేశారు. లాక్ డౌన్ టైంలో ప్రమాదం జరిగి కొంత నష్టం జరిగినప్పటికీ మళ్ళీ వాటిని వేసే పనిలో ఉంది యూనిట్. వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేశారు కానీ సలార్, సర్కారు వారి పాట కూడా అదే సీజన్ లో వచ్చే అవకాశం ఉండటంతో షూట్ చివరి దశలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు.
పవన్ ప్రస్తుతం అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ లో బిజీగా ఉన్నాడు.వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుండటంతో మరొకటి సెప్టెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఆ తర్వాత క్రిష్ ది ఉంటుంది. ఇవయ్యాకే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. పవర్ స్టార్ తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ ని, బంగారం లాంటి కమర్షియల్ మూవీని తీసిన ఏఎం రత్నం చాలా గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీస్తున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా వెళ్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా జాక్వలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రామ్ పాల్, జయరామ్ ఇతర కీలక తారాగణం.