iDreamPost
android-app
ios-app

టైటిల్ కార్డులకే మూడు కోట్లా

  • Published Aug 29, 2021 | 8:50 AM Updated Updated Aug 29, 2021 | 8:50 AM
టైటిల్ కార్డులకే మూడు కోట్లా

డార్లింగ్ ఫ్యాన్స్ అయిపోయిందనుకుంటున్న రాధే శ్యామ్ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని ఇన్ సైడ్ టాక్. అసలు సినిమా మొత్తం ఫినిష్ చేసినప్పటికీ మరికొన్ని ఆకర్షణలు జోడించేందుకు యూనిట్ కొత్త ప్లాన్లు వేస్తోందని తెలిసింది. టైటిల్స్ రోలింగ్ కోసం తీసే ఎపిసోడ్ కోసం కొత్తగా మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేక సెట్ ఒకటి వేస్తున్నారట. ఇందులో క్యాస్టింగ్ మొత్తం ఉండకపోయినా ప్రభాస్ పూజా హెగ్డేల మీద స్పెషల్ గా తీయబోయే సీన్లు బిట్ సాంగ్ ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ జరగని ప్రయోగం ఇందులో చేయబోతున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ లో దాన్ని పూర్తి చేసి మొత్తంగా గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు

2022 జనవరి 14 విడుదల షెడ్యూల్ చేసిన రాధే శ్యామ్ రావడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు కానీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి పోటీలో దిగొచ్చన్న వార్తల నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ముందుగా డేట్ లాక్ చేసుకుంది రాధే శ్యామే. తర్వాత సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లు రేస్ లోకి వచ్చాయి. సరే ట్రయాంగిల్ వార్ బాగుంటుందని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దానికి భిన్నంగా ఆర్ఆర్ఆర్ గురించి ఇప్పుడు ప్రచారం రావడంతో అసలు ఏం జరగబోతోందో అంతు చిక్కడం లేదు. మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన రాధే శ్యామ్ కు ఎప్పుడైనా పోటీ తప్పేలా లేదు.

డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా రూపొందుతున్న రాధే శ్యామ్ అధిక భాగం యూరోప్ లో షూట్ చేశారు. జయరాం, భాగ్యశ్రీ లాంటి సీనియర్ తారాగణం ఇందులో గట్టిగా ఉంది. ఎవరూ ఊహించని రీతిలో క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తాయని టాక్ ఉంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన దీని ఆడియోని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కనక సంక్రాంతికే ఫిక్స్ అయితే ఏం చేయాలనే దాని మీద కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయట. సాహూ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు

Also Read : సోషల్ మీడియాలో ఇదేం ప్రచారం

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişenbetHoliganbet Giriş