ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. తాజాగా మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి మధుశాలిని. ఆ తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్, వాడు-వీడు, గోపాల గోపాల… లాంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవలే ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని పలకరించింది మధుశాలిని.
తాజాగా ఈ తెలుగమ్మాయి తమిళ హీరోని వివాహం చేసుకుంది. పలు తమిళ సినిమాలు, సిరీస్ లలో నటించిన తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది.
తమ వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మధుశాలిని. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్ కలిసి నటించారు. ఆ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇప్పుడు ఇలా పెళ్లి పీటలెక్కారు.
78381