iDreamPost
android-app
ios-app

Telugu Bigg Boss 5 Finale : స్టార్ సెలెబ్రిటీలతో కలర్ఫుల్ క్లైమాక్స్

  • Published Dec 20, 2021 | 5:03 AM Updated Updated Dec 20, 2021 | 5:03 AM
  • Published Dec 20, 2021 | 5:03 AMUpdated Dec 20, 2021 | 5:03 AM
Telugu Bigg Boss 5 Finale : స్టార్ సెలెబ్రిటీలతో కలర్ఫుల్ క్లైమాక్స్

మొత్తం అయిదు సీజన్లలో చాలా చప్పగా సాగిన బిగ్ బాస్ 5 ఎట్టకేలకు ముగిసింది. వంద రోజుల ప్రహసనాన్ని మంచి మల్టీ స్టారర్ క్లైమాక్స్ తో ఫినిష్ చేయడం అభిమానులకు కిక్ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టే సన్నీనే విజేతగా నిలిచాడు. శ్రీరామచంద్రకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రేస్ లో మాత్రం నిలవలేకపోయాడు. తనకన్నా వివాదాలతో హైలైట్ అయిన యుట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ రన్నర్ గా నిలవడం విశేషం. యాంకర్ రవిని టాప్ 5లో నుంచి తప్పించడం లాంటి కారణాలు ఈ సీజన్ మీద అసంతృప్తి పెరగడానికి కారణం అయ్యాయి. సన్నీకి విన్నర్ గా 50 లక్షల నగదుతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా సొంతమవుతుంది.

వీజే సన్నీ ఇప్పటికే హీరోగా చేస్తున్న సినిమా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సకల గుణాభిరామా పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడీ బిగ్ బాస్ వల్ల ఏదైనా బిజినెస్ ప్రయోజనం కలుగుతుందేమో చూడాలి. 19 కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ 5 ఈసారి సెలబ్రిటీల కొరతతో బాగా ఇబ్బంది పడింది. గత సీజన్ల మాదిరి ఈ సారి ఆర్మీలు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో హడావిడి చేసే రేంజ్ ఎవరికీ పెద్దగా లేకపోవడంతో రీచ్ తగ్గిపోయింది. దానికి తోడు గేమ్స్ ని డిజైన్ చేసిన తీరు, వాటిని సభ్యులు ఆడిన విధానం కూడా ఏమంత ఆకట్టుకోలేదు. మధ్యమధ్యలో కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ఫలితం మాత్రం తక్కువే

కాకపోతే ప్రమోషన్ల కోసం వచ్చిన స్టార్లతో నిన్నటి ఎపిసోడ్ కలర్ఫుల్ గా సాగింది. రన్బీర్ కపూర్-అలియా భట్ లు బ్రహ్మాస్త్రకు, రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు, సుకుమార్ రష్మిక మందన్న పుష్పకు, నాని సాయి – పల్లవి – కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్ కు, నాగ చైతన్య ప్రో కబడ్డీ ప్రమోషన్ కు, దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ఆల్బమ్ కోసం ఇలా అందరూ వచ్చి హౌస్ లో సందడి చేశారు. వాళ్లకూ స్టార్ మాకు ఇది చాలా హెల్ప్ అయ్యింది. మొత్తానికి వంద రోజులకు పైగా సాగిన సీజన్ 5 నుంచి నిర్వాహకులు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మరి సీజన్ 6కి ఏమైనా మార్పులు చేసి సెలబ్రిటీ కలర్ పెంచుతారేమో చూడాలి.

Also Read : Bigg Boss 5 Finale : బిగ్ బాస్ ఫినాలే.. ఏకంగా ఐదు సినిమాల ప్రమోషన్.. వాడకం మాములుగా లేదుగా!

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet