iDreamPost
android-app
ios-app

TDP Pathabhi -వివాదాస్పద టీడీపీ నేత పట్టాభి అరెస్ట్..

TDP Pathabhi -వివాదాస్పద టీడీపీ నేత పట్టాభి అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఉన్న పట్టాభి నివాసానికి వెళ్లిన పోలీసులు, పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా తనను అరెస్టు చేయడానికి వస్తున్న పోలీసులను చూసి పట్టాభి తన కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సిఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు అందడంతో పట్టాభిని అరెస్టు చేసి తీరాలని ఉద్దేశంతో పోలీసులు తలుపులు పగలగొట్టి పట్టాభిని అరెస్టు చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సీఎం జగన్‌పై.. తెలుగుదేశం అధికార ప్రతినిధి హోదాలో పట్టాభి మనం ప్రస్తావించలేని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడికి దిగిన తరువాత రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు సీరియస్ అయ్యాయి. అందుకే తమ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభిని అరెస్టు చేస్తున్నారన్న ఊహాగానాలతో టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా పట్టాభి ఇంటికి చేరుకున్నా పోలీసులు చివరికి కార్యకర్తల వ్యూహాలను చేధించి అరెస్ట్ చేశారు.

Also Read : Nara Lokesh – అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!