iDreamPost
android-app
ios-app

TDP Ayyanna Patrudu – అయ్యన్నపాత్రుడు ఇక అంతేనా..?

TDP Ayyanna Patrudu  – అయ్యన్నపాత్రుడు ఇక అంతేనా..?

ఎలుకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపేగానీ తెలుపు కాదన్న సామెత టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీరునకు అతికినట్లు సరిపోతుంది. అధికారం పోయిందని ఫ్రస్టేషనో లేక మళ్లీ అధికారం రాదన్న ఆందోళనో గానీ అయ్యన్నపాత్రుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యన్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నా.. ఆయన తీరు మాత్రం మార్చుకోవడం లేదు.

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు వర్థంతి సభలో.. సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని అసభ్యపదజాలంతో దూషించిన ఘటన మరువక ముందే తాజాగా మరోసారి అయ్యన్నపాత్రుడు తన నోటికి పని చెప్పారు. హెటిరో ఫార్మాలో ఐటీ దాడుల్లో దొరికిన డబ్బును వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ముడిపెడుతూ విమర్శలు చేశారు.ఆ డబ్బు అంతా వైఎస్‌ జగన్‌దేనని, అదంతా ఈ రెండున్నరేళ్ల పాలనలో సంపాదించారని తలాతోకలేకుండా ఆరోపణలు చేశారు. ఇంకా వేల కోట్ల రూపాయలు అక్కడ దాచారంటూ మోకాలికి బోడిగుండుకు ముడివేసే ప్రయత్నం చేశారు.

Also Read  :  Kapu Corporation – ఎంతో చేసిన టీడీపీని కాపులు ఎందుకు తిరస్కరించారో?

సంబంధంలేని అంశాలతో ముడిపెడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేసిన అయ్యన్న అంతటితో ఆగలేదు. మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెడుతున్నారంటూ.. జైల్లో చిప్పకూడు తిన్నవారికి పరిపాలనపై ఏం అవగాహన ఉంటుందంటూ నోరుపారేసుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మల్లెపూలు కూడా అమ్ముకుంటారంటూ తనలోని ఫ్రస్టేషన్‌ను మరోసారి బయటపెట్టుకున్నారు అయ్యన్నపాత్రుడు.

రాజకీయాల్లో తాను సీనియర్‌నని, మంత్రిగా కూడా పని చేశానన్న సోయలేకుండా అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు సర్ధిచెప్పుకోలేకపోతున్నారు. కోడెల వర్థంతి సభలో చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినా.. తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా.. చర్చిలో ఫాథర్‌ ఓ మై సన్‌.. అంటే తప్పులేనిది.. తాను అంటే వచ్చిందా..? అంటూ మాట్లాడారు. ఈ తరహాలో ప్రవర్తిస్తున్న అయ్యన్న పాత్రుడు.. ఇకపైనా నోరుపారేసుకునేందుకు ఏ మాత్రం సంకోచించడని తాజా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఈ సారి కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచే వరకూ అయ్యన్నపాత్రుడిలో ఫ్రస్ట్రేషన్‌ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రజలు అసహ్యించుకునేలా వ్యవహరిస్తున్న అయ్యన్నను ఓటర్లు ఆదరిస్తారా..? అంటే అనుమానమే.

Also Read : ABN Andhra Jyothi : బాబు – రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet