iDreamPost
android-app
ios-app

ఆ ఉద్యమానికి ఆ మీడియా అధిక ప్రాధాన్యం.. !

  • Published Jul 06, 2020 | 3:34 AM Updated Updated Jul 06, 2020 | 3:34 AM
ఆ ఉద్యమానికి ఆ మీడియా అధిక ప్రాధాన్యం.. !

ప్రజాస్వామ్య విదానంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏ పని చేసి ప్రజాప్రయోజనాల దృష్టికోణంలో చేస్తుండాలి. పనులకైనా, పథకాలకైనా, పోరాటాలకైనా ఇది వర్తిస్తుంది. ప్రజలతో సంబంధం లేకుండా చేసే కార్యక్రమాలు కొత్తలో కొంచెం ప్రచారమైనా రాన్రాను నీరసించిపోతాయి. చివరికి కేవలం ఫోటో ఫోజుల పోరాటంగానే మిగులుతుంది. ఇటీవలి కాలంలో అటువంటి పోరాటాన్ని అమరావతి రాజధాని ఉద్యమాన్ని ఉదాహరణ చెప్పొచ్చు. టీడీపీ వెన్నుదన్నుగా ఉండగా అనుకూల మీడియా సూచనలు, సలహాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నట్లుగా చూపించే కలరింగ్‌ ఇచ్చారు. అయితే రాన్రాను ఉద్యమం నీరసించిపోయింది.

ప్రస్తుతం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర విభజన సమయంలో చేసిన సమైఖ్యాంధ్ర ఉద్యమంతో కొందరు విశ్లేషకులు పోలుస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తమకు ఏం కావాలో స్పష్టంగా చెప్పకపోవడంతో ఆంధ్రా ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందన్న భావనను కొందరు నిపుణులు బాహాటంగా చెబుతుంటారు. అప్పటి కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వం విడదీయడానికి సిద్ధమైపోగా సమైక్యంగా ఉంచండి అన్న నినాదంతో పోరాడడం కాలం వృధా తప్పితే కలిగిన ప్రయోజనం మాత్రం ఏమీలేదన్నది వాస్తవం. ఇదే రీతిలో తమకేం కావాలన్నదానిపై స్పష్టమైన డిమాండ్‌ లేకుండా సాగుతున్న అమరావతి ఉద్యమం భవిష్యత్తు కూడా ఇదే రీతిలో ఉంటుందన్నది కొందరి విశ్లేషకుల మాట. రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమంలో భాగస్వాములు.. అంటూ మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఇప్పటికిప్పుడు ఒక మండలానికి, అధికార పక్షం చెబుతున్నట్లు నాలుగు గ్రామాలకు మాత్రమే పరిమితమైపోయిందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే విశ్లేషకుల మాట నిజమవుతుందన్న విషయం అర్ధమవుతోంది.

ఉద్యమం నీరసించిపోవడానికి కరోనాను కూడా ఒక కారణంగా నిలుస్తోంది. లాక్డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో పేపర్లలో ఫోటోలకు మాత్రమే ఇది పరిమితమైపోయింది. అచ్చంగా సమైక్యాంద్ర ఉద్యమం మాదిరిగానే. స్పష్టమైన లక్ష్యం లేకుండా సాగిన ఉద్యమ ఫలితం ఏ విధంగా ఉందో గతం చెబుతూనే ఉంది. అయినప్పటికీ వెనుకనుంచి వస్తున్న పోద్భలంతో సాగుతున్న అమరావతి ఉద్యమ ఫలితం ఏంటన్నది ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసేసింది. అంతేకాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనలను పట్టాలెక్కించి, తన పని తాను చేసుకుపోతోంది.

ఏదో ఒక వంకతో జనంలో ఉండాలని కంకణం కట్టుకున్న బాబు అండ్‌ బ్యాచ్‌ నీరసిస్తున్న ఉద్యమాన్ని భుజానికెత్తుకుని, తనతో పాటు మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయడం కూడా ఇక్కడ గమనించొచ్చు. ఒక వేళ క్రెడిట్‌ వచ్చే పక్షంలో ఇతర రాజకీయపక్షాలకు పెదబాబుగారు ఈ అవకాశం ఇస్తారా? అన్న కోణంలో చూస్తే అమరావతి రాజధాని పోరాటం ఫలితం తేలని ప్రయోగమేనన్ని స్పష్టమవుతోందని మరికొందరు నిశ్చితాభిప్రాయాన్ని కాదనలేం. గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ ఫలితం, లక్ష్యం లేకుండా సాగుత్ను రాజధాని అమరావతి పోరాటం, పెదబాబు వ్యవహర తీరును పరిగణనలోకి తీసుకుంటే అమరావతి ఉద్యమానికి పచ్చ బ్యాచ్‌ జాకీలేయడం వృధాయేనని చెప్పక తప్పదు.