iDreamPost
iDreamPost
సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసి కోరోనా బ్రేక్ ని పూర్తిగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అంతా సద్దుమణగగానే పరశురాం దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం తర్వాత ఏకంగా రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని పరశురాం చేస్తున్న మూవీ ఇదే. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని చాలా గొప్పగా అన్ని కమర్షియల్ అంశాలతో బెస్ట్ అవుట్ పుట్ ఇస్తానని డైరెక్టర్ ఊరిస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ 28 కూడా లాక్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని ఇన్ సైడ్ టాక్.
అర్జున్ రెడ్డితో డెబ్యుతోనే సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగా చెప్పిన స్టొరీ ఒకటి బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ చేయమని మహేష్ పురమాయించినట్టుగా వినికిడి. నిజానికి ఈ కాంబినేషన్ గురించిన వార్తలు గతంలోనే చాలాసార్లు వచ్చాయి. కాని కథల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ప్రిన్స్ కొంతకాలం సందీప్ ని హోల్డ్ లో పెట్టాడు. ఈలోగా సందీప్ వంగా హిందిలో కబీర్ సింగ్ రూపంలో ఏకంగా 200 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకుని రీమేక్ తోనూ సత్తా చాటాడు.
ఆ తర్వాత ఇతని నెక్స్ట్ మూవీ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. మధ్యలో ఓ క్రైమ్ థ్రిల్లర్ చేస్తారని వినిపించింది కాని దాని గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. విజయ్ దేవరకొండ లాంటి కొత్త హీరోతోనే ఓ రేంజ్ ఎలివేషన్లతో లవ్ స్టొరీనే అంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సందీప్ వంగా నిజంగా మహేష్ తో ఛాన్స్ వస్తే ఇకే స్థాయిలో చూపిస్తాడో వేరే చెప్పాలా. అయితే దీనికి సంబంధించిన క్లారిటీ రావడానికి చాలా టైం పట్టొచ్చు. కరోనా పుణ్యమాని షూటింగులు సెప్టెంబర్ దాకా మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి పరుశురాం ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాకే దీని గురించిన స్పష్టత వస్తుంది.