iDreamPost
android-app
ios-app

ఒకచోట పాస్ మరోచోట ఫెయిల్ – Nostalgia

  • Published Dec 19, 2020 | 10:32 AM Updated Updated Dec 19, 2020 | 10:32 AM
ఒకచోట పాస్ మరోచోట ఫెయిల్ – Nostalgia

ఇద్దరు ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమా మొత్తాన్ని ఎంటర్ టైన్మెంట్ తో నడిపించడం అంత సులభం కాదు. ఏ మాత్రం అటుఇటు అయినా మొత్తానికే మోసం వస్తుంది. అందులోనూ రీమేకులను డీల్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వహించాలి. ఒరిజినల్ వెర్షన్ కు వచ్చిన ఫలితమే ఇక్కడా దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1988లో సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభు హీరోలుగా ప్రసిద్ధ దర్శకుడు ముత్తురామన్ తమిళంలో ‘గురు శిష్యన్’ తీశారు. అంతకు ముందు ఏడాది హిందీలో వచ్చిన ఇన్సాఫ్ కి పుకార్ కి ఇది పునఃనిర్మాణం. దీని విడుదలకు మూడు నెలల ముందు ఎంజిఆర్ చనిపోవడంతో తమిళనాడులో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. అయినా కూడా గురుశిష్యన్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి సిల్వర్ జూబ్లీ ఆడింది. రజని ప్రభు మొదటిసారి కలిసి నటించిన సినిమా ఇది.

ఈ విజయాన్ని చూసి తెలుగులోనూ తీస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నిర్మాతలు ప్రకాష్, సాంబశివరావు రీమేక్ హక్కులు కొన్నారు. హీరోలుగా కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్ నటించగా వాళ్లకు జోడిగా సుమలత, ఖుష్బూ చేశారు. ట్యూన్లను మార్చకుండా ఇళయరాజానే యథాతథంగా అదే సంగీతాన్ని అందించారు.ఇంకొకరైతే సరిగా డీల్ చేయలేరన్న అనుమానంతో ముత్తురామన్ నే ఇక్కడ కూడా దర్శకత్వం వహించేందుకు ఒప్పించారు. కోట, గొల్లపూడి, సుధాకర్, మనోరమ, మహర్షి రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత గణేష్ పాత్రో సంభాషణలు సమకూర్చారు. 1990 జనవరి 26 గురుశిష్యులు విడుదలయ్యింది.

అనూహ్యంగా సినిమా ఊహించని విధంగా అంచనాలు అందుకోలేకపోయింది. ఇద్దరు ఖైదీలు ఉరిశిక్ష పడ్డ అమాయకుడి కోసం బయటికి వచ్చాక అతని చివరి కోరికను తీర్చడానికి నడుం బిగిస్తారు. కట్ చేస్తే కథ ఏవో మలుపులు తిరుగుతూ నిధి వేటకు మళ్లుతుంది. దాదాపు స్క్రీన్ ప్లే మొత్తం ఎంటర్ టైన్మెంట్ కోణంలోనే సాగుతుంది. అయితే తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్ర ఇక్కడ ఫామ్ తగ్గిపోయిన కృష్ణంరాజు చేయడం అంతగా నప్పలేదు. అక్కడ హైలైట్ అయిన కామెడీ ట్రాక్ ఇక్కడ పండలేదు. దీంతో పాటలు ఎంత బాగున్నా ముత్తురామన్ టేకింగ్ లో కనిపించిన ఆరవ వాసన ఇక్కడి ఆడియన్స్ కు అంతగా రుచించలేదు. ఫలితంగా గురుశిష్యులకు బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు.తర్వాత తమిళ వెర్షన్ ని గురు పేరుతో మళ్ళీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం ఫైనల్ ట్విస్ట్.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet GirişGrandpashabet Giriş