Idream media
Idream media
అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో తీర్పు రామాలయానికి అనుకూలంగా వస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, రెండేళ్ళలో పూర్తి చేయాలన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయని గుర్తు చేశారు. రామాలయంపై తీర్పు అనుకూలంగా వస్తే, తమ తదుపరి లక్ష్యాల్లో కాశీ విశ్వనాథుని దేవాలయం, మధుర శ్రీకృష్ణ దేవాలయం ఉన్నట్లు తెలిపారు.
అయోధ్య రామ జన్మ భూమి వివాదంలో కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే రాజ్యాంగంలోని అధికరణ 300ఏ ప్రకారం ఆ భూమిని జాతీయం చేయవచ్చునని తెలిపారు. మొఘలుల పరిపాలనా కాలంలో 40 వేల దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. కాశీ విశ్వనాథుని దేవాలయం కోసం జరిగే పోరాటం చాలా సులువుగా ఉంటుందన్నారు.