పోలీసులది మానవతావాదం.. మావోయిస్టులది హింసావాదం అంటూ మన్యం విద్యార్థులు గళమెత్తారు. శనివారం అరకు వ్యాలీ మండల కేంద్రంలోని ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు మావోయిస్టులకు వ్యతిరేకంగా బ్యానర్లను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. అనంతరం జీకేవీధి జంక్షన్ లో మానవహారం చేశారు.
ప్రస్తుతం మన్యం ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. గెరిల్లా సైన్యంలో చేరాలంటూ మావోయిస్టుల పేరుతో కర పత్రలు వెలిశాయి. మరోవైపు మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. దీంతో గత మూడు రోజులుగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని మన్యం గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.