iDreamPost
android-app
ios-app

బెల్లం హీరో బాలీవుడ్ కసరత్తు

  • Published Mar 25, 2021 | 6:24 AM Updated Updated Mar 25, 2021 | 6:24 AM
బెల్లం హీరో బాలీవుడ్ కసరత్తు

ఇక్కడ వర్కౌట్ కావడంలో లేట్ అవుతుందనో లేక యుట్యూబ్ లో తన ఫ్లాప్ సినిమాలను సైతం నార్త్ ఆడియన్స్ మిలియన్లలో చూస్తున్నారనే అంచనానో తెలియదు కానీ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం ముంబై లోనే పాగా వేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండబోతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక విలన్ గా కనిపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే వదిలిన ఓ మాస్ ఫోటో స్టిల్ దానికి సంబంధించినదేనట. అందరి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే కన్ఫర్మ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా రాలేదు

ఛత్రపతికి ఇంకా హీరోయిన్ కూడా సెట్ కాలేదు. స్టార్ హీరోయిన్లను ఇద్దరు ముగ్గురిని అడిగి డేట్స్ కారణమో లేక మరి ఇంకేదైనా రీజనో తెలియదు కానీ ఇప్పటికైతే ఎవరినీ ఫైనల్ చేయలేదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. హిందీ ఆడియన్స్ సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ ని కొంత తగ్గించి కమర్షియల్ అంశాలను ఎక్కువగా జోడిస్తారని సమాచారం. ఇంతకు మించి ఇంకే డీటెయిల్స్ బయటికి రావడం లేదు. చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ఛత్రపతినే ఎందుకు ఎంచుకున్నారో భేతాళ ప్రశ్నగానే మిగిలిపోయింది

మొన్న జనవరికి అల్లుడు అదుర్స్ రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్న సాయి శ్రీనివాస్ ఇటు నటనలోనూ అటు కథల ఎంపికలోనూ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఉన్నదాన్ని కన్నా ఎక్కువ మాస్ ఇమేజ్ ని ఊహించుకుని చేస్తున్న తప్పుల వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఛత్రపతి రీమేక్ కూడా ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అసలుకే మోసం వస్తుంది. అసలే ఒరిజినల్ వెర్షన్ హిందీ డబ్బింగ్ ని యూట్యూబ్ లో అక్కడి ప్రేక్షకులు మిలియన్లలో చూసేశారు. మళ్ళీ అదే కథ బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇష్టపడతారా అనేది కాలమే నిర్ణయించాలి