Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతునే ఉన్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ శాసనసభ్యులు కరోనా బారిన పడగా.. తాజాగా, మరో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా తేలింది. కర్నూలు జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ రోజు శుక్రవారం వచ్చిన పరీక్షా ఫలితాలలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తనను పరామర్శించడానికి ఎవరూ రావొద్దని చక్రపాణిరెడ్డి కోరారు.
కాగా, ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే ఇటీవలే కరోనా బారినపడ్డ కడప ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తాను కోలుకున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఇప్పటికే కరోనా బారిన పడగా తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యేకు పాజిటివ్ నిర్ధారణ అయింది.