iDreamPost
android-app
ios-app

శ్రీలంక షాకింగ్ విక్టరీ.. 3 ఓవర్లలో 59 పరుగులు కొట్టేశారు 

శ్రీలంక షాకింగ్ విక్టరీ.. 3 ఓవర్లలో 59 పరుగులు కొట్టేశారు 

క్రికెట్లో ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా టీ20 మ్యాచుల్లో ఇలాంటి షాకింగ్ విషయాలు భలే థ్రిల్ ఇస్తాయి. నిన్న జరిగిన ఆస్ట్రేలియా – శ్రీలంక మ్యాచ్ కూడా అలాంటి షాక్ నే ఇచ్చింది క్రికెట్ అభిమానులకు. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న ఆస్ట్రేలియా ఊహించని విధంగా శ్రీలంకతో ఓటమి పాలైంది.

ఆసీస్ – శ్రీలంకల నడుమ జరిగిన చివరి టి20 మ్యాచ్ లో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి శ్రీలంక. కానీ, 17 ఓవర్లు పూర్తైయ్యే సమయానికి లంక స్కోరు 118/6 గా ఉంది. ఇక ఆఖరి 3 ఓవర్లలో 59 పరుగుల లక్ష్యం మిగిలింది.

ఇక్కడే శ్రీలంక కెప్టెన్ దసున్‌ షనక అసాధ్యమైన రీతిలో మ్యాచ్ ను గెలిపించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో చివరి 3ఓవర్లలో 22, 18, 19 పరుగులు చేసి లంకకు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా అద్భుతమైన ఆటతీరుతో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను గెలిపించాడు.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో వార్నర్, స్మిత్, స్టోయినిస్ రాణించారు. అయితే 2-1 తేడాతో సిరీస్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నప్పటికీ, ఈ మ్యాచ్ తో క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకుంది శ్రీలంక.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis