iDreamPost
iDreamPost
శర్వానంద్ హీరోగా కిషోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన శ్రీకారం నిన్న రసవత్తరమైన పోటీ మధ్య విడుదలయింది. తనతో సమానంగా ఇమేజ్ ఉన్న హీరో లేకపోయినా కంటెంట్ పరంగా మిగిలిన చిత్రాలు కాంపీట్ చేసేలా ఉండటంతో ఓపెనింగ్ ని షేర్ చేసుకోక తప్పలేదు. అయితే ప్రీ రిలీజ్ కు ముందు వచ్చిన బజ్, వ్యవసాయాన్ని కాన్సెప్ట్ గా తీసుకుని నిజాయితీగా చేసిన ప్రయత్నమనే పేరు ముందే రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగుంది. అయితే ఎంత ఎమోషన్ ఉన్నా కట్టిపడేసే కథనం లేకపోవడం శ్రీకారంకు కొంత మైనస్ గా నిలుస్తోంది. లాంగ్ రన్ నిలిచేందుకు ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో చెప్పలేం.
ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫో ప్రకారం శ్రీకారం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 కోట్ల 29 లక్షల షేర్ రాబట్టుకుంది. జాతి రత్నాలతో పోల్చుకుంటే స్క్రీన్లు ఎక్కువగా దక్కినా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉపయోగించుకున్నా వెనుకబడటం మాత్రం షాక్ కలిగించే విషయం. గ్రాస్ కూడా 7 కోట్ల పై చిలుకు వచ్చింది కానీ జరిగిన బిజినెస్ ప్రకారం చూసుకుంటే ఇది కొంత ఆందోళన కలిగించేదే. అయితే వీకెండ్ నాలుగు రోజులు వచ్చింది కాబట్టి హౌస్ ఫుల్ బోర్డులు గట్టిగా పడితే రికవరీ శాతం పెరుగుతుంది. టికెట్ రేట్లను పెంచడం ఇక్కడ ఒకరకంగా సెల్ఫ్ గోల్ గా మారినట్టు కనిపిస్తోంది.ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి
– ఏరియా వారీగా శ్రీకారం మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 1.08cr |
సీడెడ్ | 0.72cr |
ఉత్తరాంధ్ర | 0.54cr |
గుంటూరు | 0.65cr |
క్రిష్ణ | 0.231cr |
ఈస్ట్ గోదావరి | 0.44cr |
వెస్ట్ గోదావరి | 0.27cr |
నెల్లూరు | 0.14cr |
Total Ap/Tg | 4.07cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.08cr |
ఓవర్సీస్ | 0.82cr |
ప్రపంచవ్యాప్తంగా | 4.84cr |
ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే శ్రీకారం ఇంకా చాలా మెరుగా పెర్ఫార్మ్ చేసి ఉండేదన్న మాట వాస్తవం. ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్న ప్రేక్షకులు ఫస్ట్ ఆప్షన్ గా జాతిరత్నాలునే పెట్టుకుంటున్నారు. గాలి సంపత్, రాబర్ట్ ల డిజాస్టర్ రిపోర్ట్స్ చాలా ప్లస్ అవ్వబోతున్నాయి. ఒకవేళ సోమవారం నుంచి వీటికి స్క్రీన్లు తగ్గించాల్సి వస్తే ఆటోమేటిక్ గా పై రెండు పంచుకుంటాయి. మళ్ళీ వచ్చే శుక్రవారం కొత్త సినిమాలు చాలా క్యూలో ఉన్నాయి కాబట్టి శ్రీకారంకు ఫస్ట్ వీక్ చాలా ముఖ్యం. శర్వాతో పాటు నటీనటుల పెర్ఫార్మన్స్, రైతుల మీద తీసిన సినిమాగా శ్రీకారంకు గౌరవమైతే దక్కుతోంది కానీ అది భారీ కలెక్షన్లుగా మారడం చాలా అవసరం