iDreamPost
android-app
ios-app

sreeleela పెళ్లి సందD భామ చేతిలో 8 సినిమాలు

  • Published Nov 28, 2022 | 6:19 PM Updated Updated Nov 28, 2022 | 6:19 PM
  • Published Nov 28, 2022 | 6:19 PMUpdated Nov 28, 2022 | 6:19 PM
sreeleela పెళ్లి సందD భామ చేతిలో 8 సినిమాలు

మాములుగా హీరో హీరోయిన్ ఎవరైనా సరే డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినప్పుడు దాని ప్రభావం తర్వాత వచ్చే అవకాశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. కానీ శ్రీలీలకు దానికి రివర్స్ లో జరుగుతోంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన పెళ్లిసందDతో తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ డిమాండ్ పీక్స్ కు వెళ్తోంది. ఆ మూవీలో కంటెంట్ ఎంత తీసికట్టుగా ఉన్నప్పటికీ కీరవాణి పాటలు, ఈ అమ్మాయి గ్లామర్ కోసం థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ఉన్నారు. అందుకే కొన్ని సెంటర్లలో మంచి వసూళ్లు వచ్చాయి. దెబ్బకు ఆఫర్లు చెక్కులు పట్టుకుని క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ శాండల్ వుడ్ రెండు చోట్లా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి

రవితేజ లాంటి సీనియర్ మోస్ట్ హీరోతో ఓకే చెప్పడానికి సైతం వెనుకాడకపోవడం శ్రీలీల ప్లానింగ్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ధమాకా వచ్చే నెల 23న రిలీజవుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ బోయపాటి శీను కాంబినేషన్ మూవీలో తనే జోడి. నితిన్ వక్కంతం వంశీ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఆల్రెడీ మొదలైపోయింది. సితార సంస్థ నిర్మిస్తున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజులో ఆడి పాడేసింది. మహేష్ బాబు 28లో రెండో కథానాయికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనేనే లాక్ చేసినట్టు టాక్ ఉంది. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఆల్రెడీ డీల్ అయిపోయిందని వినికిడి. ప్రస్తుతం మహేష్ కుటుంబం ఉన్న బాధలో ఇంకొద్ది రోజులు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వరు

ఇవి కాకుండా బాలకృష్ణ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ సైతం తన ఖాతాలో పడేలా ఉంది. గాలి జనార్దన్ రెడ్డి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్న సినిమాలో, వైష్ణవ్ తేజ్ నాలుగో మూవీలోనూ బుక్ అయ్యింది. మొత్తం కౌంట్ చూసుకుంటే ఎనిమిది చేరాయి. ఇంత బిజీగా ఇప్పుడు టాప్ లో ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్నలు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. వాళ్ళు కేవలం ప్యాన్ ఇండియా వైపే ఫోకస్ పెడితే శ్రీలీల మాత్రం అందివచ్చిన అవకాశాలన్నీ తెలివిగా వాడుకుంటోంది. అందుకే మాస్ మహారాజాతో జట్టు కట్టినా యూత్ హీరోలు సైతం తన వైపే మొగ్గు చూపుతున్నారు. అందం అదృష్టం కలిసి వస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా సుడి మాములుగా లేదు

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetgrandpashabet girişultrabetgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet