iDreamPost
iDreamPost
మొన్న 25న క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదలైన సోలో బ్రతుకే సో బెటరూ మూడు రోజుల వీకెండ్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. సగం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు నడుస్తున్నా కూడా మంచి ఫిగర్లు నమోదవుతున్నాయి. పోటీగా ఒక్క సినిమా కూడా లేకపోవడం సాయి తేజ్ కి బాగా కలిసి వస్తోంది. టాక్ ఎలా ఉన్నా తొమ్మిది నెలల ఎడబాటుని తీర్చుకోవడం కోసం మూవీ లవర్స్ టికెట్లు కొనేస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఆదివారం చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. కాకపోతే శనివారం కంటే ఆదివారం లెక్క కొంచెం తక్కువ రావడం ఆందోళన కలిగించేదే అయినా ఈ రోజు నుంచి రన్ చాలా కీలకంగా మారబోతోంది. అధికారికంగా కాకపోయినా మూడో రోజు ఏరియాల వారీగా ట్రేడ్ నుంచి అందుతున్న కలెక్షన్లు(షేర్) ఈ విధంగా ఉన్నాయి.
Checkout area wise day 3 Collections
AREA | SHARE |
నైజాం | 0.55cr |
సీడెడ్ | 0.32cr |
ఉత్తరాంధ్ర | 0.21cr |
గుంటూరు | 0.17cr |
క్రిష్ణ | 0.11cr |
ఈస్ట్ గోదావరి | 0.12cr |
వెస్ట్ గోదావరి | 0.8cr |
నెల్లూరు | 0.8cr |
3వ రోజు ఆంధ్ర తెలంగాణా మొత్తం | 1.64cr |
ఈ లెక్కన చూసుకుంటే టార్గెట్ పెట్టుకున్న తొమ్మిది కోట్ల షేర్లో ఇప్పటిదాకా మూడు రోజుల్లో 70 శాతం వచ్చేసినట్టే. అయితే రోజు రోజుకి డ్రాప్ ఉండటం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. మొదటి మూడు రోజులు ఈ మాత్రం సందడి ఉండటం సహజం. అందుకే ఇకపై ప్రతి షో కీలకంగా మారనుంది. ఇంకో మూడు కోట్లు వస్తే సేఫ్ అయినట్టే. అదేమీ పెద్ద విషయం కాదు కానీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు రావాలంటే మాత్రం ఇదే ట్రెండ్ రెండు మూడు వారాలు కొనసాగాలి. కానీ అది సాధ్యమవ్వడం దీనికొచ్చిన టాక్ కి అనుమానమే. సరే అదృష్టం కలిసొచ్చి జనం తమ ఆదరణ కొనసాగిస్తే మాత్రం సోలో బ్రతుకే సో బెటరూ ఇయర్ ఎండింగ్ హిట్ గా చెప్పుకోవచ్చు.