iDreamPost
iDreamPost
కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది, కేసులు పెరుగుతున్నాయి, చాలా మటుకు సింగల్ స్క్రీన్లు మూతబడ్డాయి లాంటి అడ్డంకుల మధ్య కూడా నిన్నో రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. పెద్దగా అంచనాలు లేని చిత్రాలు కావడంతో సీటింగ్ నిబంధనలతో సంబంధం లేకుండా యూనిట్లు బాగానే ప్రోమోట్ చేసుకున్నాయి. వీటిలో అంతో ఇంతో సోషల్ మీడియా జనాల దృష్టిలో పడ్డ మూవీ శుక్ర. సుకు పుర్వజ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ బడ్జెట్ మూవీ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. ఏఎంబి లాంటి మల్టీ ప్లెక్సుల్లోనూ ఇది రిలీజ్ కావడంతో దీని మీద ఓ మోస్తరు ఆసక్తి నెలకొంది. ఇదెలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
లవ్ మ్యారేజ్ చేసుకున్న విల్లి(అరవింద్ కృష్ణ)రియా(శ్రీజిత ఘోష్)వైజాగ్ లో సెటిలవుతారు. రియా పుట్టినరోజు కోసం సిటికి దూరంగా ఓ బంగ్లాలో పెద్ద పార్టీ ఆరెంజ్ చేస్తాడు విల్లి. అయితే అనూహ్యంగా ఆ పార్టీలో మూడు హత్యలు జరుగుతాయి. అప్పటికే నగరాన్ని ఓ దొంగల ముఠా ఇదే తరహాలో దొంగతనాలు మర్డర్లు చేస్తూ వణికిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ రోజు పార్టీలో ఏం జరిగింది, జరిగిన ఘాతుకాలకు కారణం ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానమే శుక్ర. హీరో అరవింద్ కృష్ణ నటన పరంగా పర్వాలేదు అనిపించుకోగా శ్రీజిత మాత్రం బోల్డ్ సీన్స్ లో ఓ రేంజ్ రెచ్చిపోయింది. మిగిలిన ఆర్టిస్టులు జస్ట్ ఓకే అనిపించుకుంటారు.
పాయింట్ యునీక్ గా అనిపించినా ట్రీట్మెంట్ ని చాలా ఫ్లాట్ గా రాసుకోవడంతో దర్శకుడు సుకు పుర్వజ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. లాజిక్స్ మిస్ కావడం పక్కనపెడితే హత్యల మీద చేసింది ఫోకస్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం మీద పెట్టకపోవడంతో శుక్ర చాలా చప్పగా సాగుతుంది. సింక్ కాని ఎమోషన్లను ఇరికించే ప్రయత్నం చేయడం కూడా ఫ్లోని చాలా దెబ్బ తీసింది. థీమ్ ఆసక్తికరంగా ఉంటే సరిపోదు దాన్ని ఆడియన్స్ మెచ్చుకునేలా ఎలా చేయాలనే దాని మీద హోమ్ వర్క్ చేయడం మర్చిపోతున్నారు యంగ్ డైరెక్టర్స్. శుక్ర దానికి మరో ఉదాహరణగా నిలిచింది. ఏ అంచనాలు లేకపోయినా మెప్పించడం కష్టమే