iDreamPost
android-app
ios-app

షేర్నీ సినిమా రిపోర్ట్

  • Published Jun 18, 2021 | 5:45 AM Updated Updated Jun 18, 2021 | 5:45 AM
షేర్నీ సినిమా రిపోర్ట్

థియేటర్లు తెరుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలైనప్పటికీ డైరెక్ట్ ఓటిటి ప్రీమియర్లు మాత్రం కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నిన్న విడుదలైన సినిమా షేర్నీ. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ థ్రిల్లర్ మీద భారీగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అంత ఆసక్తికరంగా అనిపించనప్పటికీ అసలు మూవీలో ఏదైనా విషయం ఉండకపోదా అని ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. అందులోనూ గతంలో న్యూటన్ లాంటి న్యూ ఏజ్ సినిమాను ఇచ్చి అన్ని వర్గాల ప్రశంసలు అందుకున్న అమిత్ మసుర్కర్ దర్శకుడు కావడంతో షేర్నీ మీద ప్రత్యేక హైప్ వచ్చింది. మరి ఇదెలా ఉందొ రిపోర్ట్ లో చూద్దాం.

అడవికి దగ్గరగా ఉండే గ్రామస్థులను వాళ్ళ పాడి పశువులను లక్ష్యంగా చేసుకుని కొన్ని పులులు ప్రాణాలు తీస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ విద్య విన్సెంట్ (విద్యా బాలన్)వాటిని పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తుంది. అయితే స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం, వేటాడే ఆసక్తి ఉన్న పింటూ(శరత్ సక్సేనా)లాంటి స్థానికుల అత్యుత్సాహం వల్ల పులులను పట్టుకునే బదులు వాటిని చంపే పరిస్థితి వస్తుంది. ఇలా మలుపులు తిరుగుతూ విద్య అనుకున్న లక్ష్యం నెరవేరిందా, ఇన్ని అడ్డంకులు దాటుకుని పులులు, అమాయకుల ప్రాణాలు కాపాడేందుకు తను ఎలాంటి చర్యలు తీసుకుందనేదే అసలు స్టోరీ

ఈ లైన్ తో గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే అమిత్ ఈ ఇష్యూని కాస్త సీరియస్ గా చెప్పాలని చేసిన ప్రయత్నమే అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీసింది. షేర్నీ ఏ దశలోనూ ఆసక్తిగా సాగదు. పులుల వేట కాబట్టి థ్రిల్స్ ని ఆశించే ఆడియన్స్ కి కథనం చాలా నీరసం తెప్పిస్తుంది. పైగా డాక్యుమెంటరీ స్టైల్ లో వెళ్లడంతో దీని కన్నా డిస్కవరీ ఛానల్ లో వచ్చే వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్స్ నయమనిపిస్తాయి. అమిత్ లో సెన్సిబిలిటీస్ డోస్ కాస్త ఎక్కువ కావడంతో షేర్నీ ఏ దశలోనూ గ్రిప్పింగ్ గా సాగదు. పై పెచ్చు ఎంతో ఊహించుకునే క్లైమాక్స్ కూడా చప్పగా ముగుస్తుంది. ఎంత తక్కువ అంచనాలు పెట్టుకున్నా షేర్నీ కనీస స్థాయిలో కూడా మెప్పించదు.