iDreamPost
android-app
ios-app

బుల్లితెరపై సరిలేరు సెన్సేషనల్ రికార్డు

  • Published Apr 02, 2020 | 9:49 AM Updated Updated Apr 02, 2020 | 9:49 AM
బుల్లితెరపై సరిలేరు సెన్సేషనల్ రికార్డు

అదేంటి థియేటర్లు మూతబడ్డాయి, ఎప్పుడో సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఇప్పుడు రికార్డులు కొట్టడం ఏంటి అనుకుంటున్నారా. విషయం వేరే ఉంది లెండి. మొన్న ఉగాది పండగ సందర్భంగా జెమినిలో సరిలేరు నీకెవ్వరు వరల్డ్ ప్రీమియర్ టెలికాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు కొద్దిరోజుల ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడంతో దీనికి రేటింగ్స్ వస్తాయా అని అనుమానపడిన వాళ్ళు లేకపోలేదు. కాని ఆ అంచనాలు పటాపంచలు చేస్తూ సరిలేరు టీవీ రేటింగ్స్ లో కొత్త రికార్డు సృష్టించింది.

గత కొన్నేళ్ళుగా చాలా స్తబ్దుగా ఉన్న శాటిలైట్ రంగానికి ఊపోచ్చేలా ఏకంగా 23.4 రేటింగ్ సాధించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రేటింగ్ తో ఏకంగా బాహుబలి 1 అండ్ 2 ని బీట్ చేయడమే. నిజానికి ఈ సినిమాకు లాక్ డౌన్ కాన్సెప్ట్ బాగా కలిసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా జనం ఇంట్లోనే కట్టుబడి ఉండటంతో కొత్త సినిమాను బుల్లితెరపై ఫుల్ గా ఎంజాయ్ చేశారు. తాజా లెక్కల ప్రకారం సరిలేరు నీకెవ్వరు 23.4 రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా బాహుబలి 2 రెండో స్థానంలో 22.7 తో నిలిచింది. మూడో ప్లేస్ లో బాహుబలి 1 దానికన్నా తక్కువగా 21.8 రేటింగ్ తో ఆగిపోయింది.

తర్వాతి స్థానాల్లో దువ్వాడ జగన్నాధం(21.7), ఫిదా(21.3), శ్రీమంతుడు(21.24), జనతా గ్యారేజ్(20.69), రంగస్థలం(19.5), అత్తారింటికి దారేది(19.4) ఉన్నాయి. మొత్తానికి సరిలేరు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధ్యపడని బాహుబలి రికార్డుని బుల్లితెరపై సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. నెక్స్ట్ టెలికాస్ట్ లో డిలీట్ చేసిన సీన్స్ తో వేస్తామని అనిల్ సుంకర ట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అభిమానుల ఆనందం మాములుగా లేదు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş