IPL 2022లో అంపైర్‌ల తప్పిదాలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. సోమవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకి 152 పరుగులు చేయగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 158 పరుగులు కొట్టి విజయం సాధించారు. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ తప్పిదాలు జరగడంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అంపైర్ మీద ఫైర్ అయ్యాడు.
కోల్‌కతా బ్యాటింగ్ చేస్తుండగా 13వ ఓవర్‌లో బౌల్ట్ వేసిన షాట్ బాల్‌ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు మిస్ అయి గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. దీంతో సంజూ శాంసన్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ దాన్ని వైడ్ ప్రకటించడంతో సంజూ రివ్యూ తీసుకున్నాడు. రిప్లే లో బాల్ క్లియర్‌గా గ్లోవ్స్‌ను తాకినట్లు కన్పించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ఇక 19వ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ వేయగా అంపైర్ నితిన్ పండిత్ మూడు బంతులను వైడ్స్‌గా ఇచ్చాడు. ఇందులో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఒక షార్ట్ బాల్‌ను అంపైర్ వైడ్ ఇవ్వడంతో కెప్టెన్ శాంసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే ఓవర్లో ఆఖరిబంతి ప్రసిద్ధ్ యార్కర్ వేశాడు. అయితే బాల్ బ్యాట్‌కు చాలా దగ్గరగా వెళ్లింది. అయినా అంపైర్ వైడ్‌గా ఇవ్వడంతో శాంసన్ అసహనానికి గురయి అంపైర్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
#Samson pic.twitter.com/GMlUZyGpDE
— Vaishnavi Sawant (@VaishnaviS45) May 2, 2022
73815