iDreamPost
android-app
ios-app

అవే గొడవలు అవే అరుపులు

  • Published Sep 30, 2020 | 6:07 AM Updated Updated Sep 30, 2020 | 6:07 AM
అవే గొడవలు అవే అరుపులు

కొంచెం పైకి కొంచెం కిందకు అనేలా సాగుతోంది బిగ్ బాస్ 4 వ్యవహారం. పెద్దగా ఇమేజ్ లేని పార్టిసిపెంట్స్ ని సెట్ చేయడం ఎంత మైనస్సో మెల్లగా అర్థమవుతోంది. ఎంతసేపు ఏడుపులు, అరుపులు, మితిమీరిన డ్రామాలు తప్ప బిగితో ఆసక్తిగా సాగే గేమ్ అంతగా కనిపించడం లేదు. ఒకరోజు అలరిస్తే ఇంకోరోజు నీరసం తెప్పిస్తోంది. ఐపిఎల్ నుంచి విపరీతమైన పోటీ ఎదురుకుంటున్న తరుణంలో ఇలా సాగడం రేటింగ్స్ కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో అనుమానమే. ఇందులో మసాలాని ఇష్టపడే ప్రేక్షకులకు ఓకే కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం కొన్ని ఎపిసోడ్లు అనవసర ప్రహసనంలా అనిపిస్తున్నాయి. అందులో నిన్న జరిగిన దాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. 

అభిజిత్, సోహైల్ లు మరోసారి మాటా మాటా అనుకున్నారు . స్వాతి దీక్షిత్ ని బుట్టలో వేసుకోవడంలో అఖిల్ బిజీ అయిపోయాడు. దూకుడు సినిమాలో బ్రహ్మానందంలా అభిజిత్, సోహైల్ లు నాగార్జున తమ ప్రదర్శన బాగుందంటే తమది బాగుందని మెచ్చుకున్నరంటూ డప్పులు కొట్టుకున్నారు. అక్కడితో ఆగక సోహైల్ ఒక అడుగు ముందుకు వేసి మగాడిలా ఆడమంటూ అభిజిత్ ని రెచ్చగొట్టడం ఒకదశలో బాగా అతి అనిపించింది. అందరూ వచ్చి చల్లబరచాల్సి వచ్చింది. ఇక కెప్టెన్ ని ఎంచుకునే క్రమంలో  పెట్టిన కాయిన్ గేమ్ కూడా సోసోగానే సాగింది. పైనుంచి పడుతున్న నాణేలను కలెక్ట్ చేసుకుని ఎవరు ఎక్కువ మిగిలించుకుంటే వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. అయితే దీనికి క్లైమాక్స్ ఈ రోజు ఉండొచ్చు. 
ఇక మిగలిన పార్టిసిపెంట్స్ కూడా నిన్న ఏదో హడావిడి చేయడం తప్ప తమదంటూ ముద్ర వవేసిన వాళ్ళు అంతగా లేరనే చెప్పాలి. గంగవ్వ అప్పుడప్పుడు సందడి చేస్తున్నా హౌస్ లో కేవలం సానుభూతి మీద కొనసాగిస్తున్నట్టు అర్థమవుతోంది. గేమ్ పట్ల ఆవిడకు ఇప్పటికీ పూర్తి అవగాహన రాలేదు. త్వరగా ఎలిమినేట్ చేస్తే సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఏదో అలా సాగదీస్తున్నట్టు కనిపిస్తోంది. మెహబూబ్, హారిక, అరియానా, సుజాత, లాస్య, నోయల్, అమ్మ రాజశేఖర్ ఎవరికి వాళ్ళు బయటికి రాకుండా ఉండేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. మొత్తానికి వీక్ డేస్ లో అల్లరి తప్ప అవసరమైన రసపట్టు మాత్రం మిస్ అవుతోంది. నిన్నటి తరహాలో మరీ చప్పగా సాగినా కష్టమే. నాగార్జున వచ్చే శని ఆదివారాలకు ధీటుగా మిగిలిన రోజులు కూడా షో నడవాలంటే మిస్ అవుతున్నదేంటో బిగ్ బాస్ అర్జెంట్ గా గుర్తించాల్సిన అవసరం ఉంది

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbet telegramHoliganbet GirişGrandpashabet Giriş