iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క దాంతోనే సమంత నెలకి మూడు కోట్లు సంపాదిస్తుందట..

  • Published Jun 13, 2022 | 7:00 PM Updated Updated Jun 13, 2022 | 7:00 PM
ఆ ఒక్క దాంతోనే సమంత నెలకి మూడు కోట్లు సంపాదిస్తుందట..

సమంత చైతూతో విడాకుల అనంతరం కెరీర్ మీద, డబ్బు మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన దగ్గరికి వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పటికే సమంత చేతిలో తెలుగులో 3, తమిళ్ లో 2, బాలీవుడ్ లో ఒకటి, మలయాళంలో ఒకటి, హాలీవుడ్ లో ఒక సినిమా.. ఇలా దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వెబ్ సిరీస్ లు కూడా సమంత చేతిలో ఉన్నాయి. ఇలా సినిమాలతో బాగానే సంపాదిస్తుంది.

ఇక ఇవే కాకుండా డబ్బుల కోసం వరుసగా యాడ్స్ చేస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా ఒప్పేసుకుంటుంది. ఇటీవల ఓ యాడ్ లో మరింత రెచ్చిపోయి బికినీలు వేసి మరీ చేసింది. మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడుతుంది.ఇలా సినిమాలు, యాడ్స్, బిజినెస్ లు అంటూ బాగానే సంపాదిస్తుంది సమంత. అయితే ఇవే కాక సమంతకి మరో ఆదాయం తన సోషల్ మీడియా నుంచి వస్తుంది.

సాధారణంగా సోషల్‌మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ గురించి పోస్ట్ చేయాలి అంటే కచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. సెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు కూడా తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో చెల్లిస్తారు. ఇక సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ కి ఎంత చెల్లిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. రీచ్ కూడా బాగానే ఉండటంతో పలు కంపెనీలు సమంతతో డీల్ మాట్లాడుకుంటున్నాయి.

అందుకే ఇటీవల సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ప్రోడక్ట్స్ గురించి రెగ్యులర్ గా ప్రమోషన్స్ చేస్తుంది. పలు కంపెనీల ప్రొడక్స్ట్ ప్రమోషన్స్ చేస్తూ దాదాపు నెలకు మూడు కోట్ల వరకు సమంత సంపాదిస్తుందట. కేవలం సోషల్ మీడియా ద్వారే నెలకి దాదాపు మూడు కోట్లు సంపాదిస్తుంది అంటే మొత్తానికి అన్ని రకాలుగా సమంత బాగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom Giriş