iDreamPost
android-app
ios-app

విరాటపర్వం వెన్నెల నిజజీవిత పాత్ర సరళ ఫ్యామిలీని కలిసిన సాయి పల్లవి.. చీర పెట్టి పంపిన సరళ తల్లి..

  • Published Jun 13, 2022 | 8:00 PM Updated Updated Jun 13, 2022 | 8:00 PM
  • Published Jun 13, 2022 | 8:00 PMUpdated Jun 13, 2022 | 8:00 PM
విరాటపర్వం వెన్నెల నిజజీవిత పాత్ర సరళ ఫ్యామిలీని కలిసిన సాయి పల్లవి.. చీర పెట్టి పంపిన సరళ తల్లి..

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. నక్సల్స్ నేపథ్యం, ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో హీరో హీరోయిన్స్ నక్సల్స్ గా కనిపించనున్నారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం టీం అంతా సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుకని నిర్వహించారు.

అయితే ఈ సినిమా నిజ జీవితంలో సరళ అనే ఓ అమ్మాయి పాత్ర నుంచి తీసుకొని రాసిన కథ అని డైరెక్టర్ గతంలోనే చెప్పారు. ఆ అమ్మాయి కాల్పుల్లో చనిపోతుంది. దీంతో సినిమాలో కూడా సాయి పల్లవి చనిపోతుంది అంతా భావిస్తున్నారు. ఈ కథ అంతా ఓ అమ్మాయి చుట్టే తిరుగుతుందని, ఆ పాత్రని సాయి పల్లవి అద్భుతంగా పోషించిందని, సాయి పల్లవి ఈ సినిమాకి మెయిన్ లీడ్ అని ముందు నుంచి డైరెక్టర్, రానా చెప్తూనే ఉన్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్ సరళ కుటుంబ సభ్యులను కలిశారు చిత్ర బృందం.

సాయి పల్లవి, రానా, డైరెక్టర్ వేణు సరళ కుటుంబ సభ్యులని కలవడంతో వారు చిత్ర యూనిట్ కి ఘనస్వాగతం పలికారు. సరళ తల్లి సాయి పల్లవి తన కూతురు పాత్ర చేసిందని చాలా ఎమోషనల్ అయింది, సాయి పల్లవిని తన సొంత కూతురిలా చూసుకుంది. అలాగే సాయి పల్లవి వెళ్ళేటప్పుడు సరళ తల్లి చీరను బహుకరించింది. వాళ్ళ ప్రేమని చూసి సాయి పల్లవి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet