Idream media
Idream media
ప్రగతి రధ చక్రాలు ఆగి, సాగిన తర్వాత సహజంగానే చార్జీల రేట్లు పెరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ప్రతి సారి ఇలాగే జరిగింది. తమ డిమాండ్ల కోసం కార్మికులు సమ్మె చేయడం, కొద్దీ రోజుల వరకు ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడం, ఆనక చర్చలకు పిలవడం, సమ్మె విరమించడం.. ఇది అనాదిగా సాగుతున్న తంతు. సమ్మె కార్మికులు చేసినా, వారి డిమాండ్లు పరిస్కారమైనా, కాకపోయినా.. బస్సులు తిరగక వచ్చిన నష్టం మాత్రం ప్రజలే భరించాలి. ఇది మరో మారు రుజువయ్యింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వల్ల దాదాపు రెండు నెలల పాటు తెలంగాణ ప్రజలు అష్ట కస్టాలు పడ్డారు. రవాణా ఖర్చు రెటియింపై జేబులు గుల్లయ్యాయి. ఇప్పుడు సమ్మె సమస్య కొలిక్కి వచ్చింది. రేపటి నుంచి బస్సులు పూర్తి స్థాయిలో తిరుగుతాయి. రేపే కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు.
ఈ రోజు వరకు సమ్మె వాళ్ళ చేతి చమురు వదిలిన తెలంగాణ జనానికి .. రేపటి నుంచి చార్జిలప్ పెంపుతో వారి జేబులకు చిల్లు పడనుంది. సమ్మె కారణంగా ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పడం లేదంటూ సీఎం కేసీఆర్ చావు కబురు చల్లగా చెప్పారు. కిలో మీటర్ కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన చార్జీలు రేపటి నుంచే అమలు లోకి వస్తాయని తెలిపారు. అంటే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక్క రూపాయి మేర ప్రయాణికులపై భారం పడబోతోంది.