iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌసులో రొమాంటిక్ యాంగిల్

  • Published Dec 03, 2020 | 6:13 AM Updated Updated Dec 03, 2020 | 6:13 AM
బిగ్ బాస్ హౌసులో రొమాంటిక్ యాంగిల్

ఫినాలేకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో బిగ్ బాస్ 4 ఎన్ని రకాల విచిత్ర మలుపులు తిరగాలో అంతకన్నా ఎక్కువే జరుగుతోంది. మొన్న పెట్టిన టాస్కులో లెవెల్ 2కి వచ్చిన నలుగురు మూడో రౌండ్ కి సిద్ధమయ్యే క్రమంలో పడరాని పాట్లు పడుతున్నారు. అవినాష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఓవర్ యాక్షన్ తగ్గించకూడదని డిసైడ్ అయ్యాడు. లెవెల్ టూకి వెళ్లకపోయినా యథావిధిగా తన కళలన్నీ బయట పెడుతున్నాడు. మోనాల్ తన్నడం గురించి మరోసారి ప్రస్తావనకు తెచ్చి సానుభూతి ట్రై చేశాడు. సోహైల్ అఖిల్ లు కలిసి గేమ్ ఆడటం మీద ఇతను రేపిన హాట్ డిస్కషన్ కాసేపు వాదోపవాదాలకు దారి తీసింది.

కిచెన్ లో ఉన్న మోనాల్ దగ్గరకు సోహైల్ వెళ్లి అవినాష్ గురించిన ప్రస్తావన తెచ్చాక ఆమెకు వార్నింగ్ ఇవ్వడం మరో ట్విస్ట్. తర్వాత మోనాల్ తానేమి తక్కువ తినలేదనే తరహాలో కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ కు కన్ఫెషన్ రూమ్ కి పిలవమని అభ్యర్థించడం సీరియల్ ను మించిన ట్విస్ట్. ఇక్కడితో ఇదంతా అయిపోలేదు. అవినాష్ దగ్గరకు వెళ్లి కావాలని తన్నలేదని క్షమాపణ కోరింది. ఏకంగా కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసి ఓ రేంజ్ లో జీవించేసింది. అతను వారిస్తే హగ్ ఇచ్చి మరీ బుగ్గ మీద ముద్దు పెట్టడం మాములుగా లేదు. అరియనాని పిలిచి మళ్ళీ అవినాష్ మీద ముద్దుల వర్షం కురిపించడం ఏమిటో చూసేవాళ్లకు అర్థమైతే ఒట్టు.

ఇదేంట్రా దేవుడా అనుకుంటుండగానే అరియనా వీళ్లకు వంత పాడుతూ ఆ ఇద్దరితో కలిసి ట్రయాంగిల్ కౌగిలింతలో భాగం పంచుకుంది. దెబ్బకు ఇంత రొమాన్స్ చూశాక అవినాష్ తగ్గకుండా ఉంటాడా. వెంటనే చల్లారిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఎపిసోడ్స్ ఎలా సాగదీయాలో అర్థం స్క్రిప్ట్ రైటర్స్ ఏదేదో చొప్పిస్తున్నట్టు జరుగుతున్న తీరుని చూస్తే అర్థం చేసుకోవచ్చు. వీక్ డేస్ షో టైమింగ్ మార్చడం చూస్తే రేటింగ్స్ మీద ఆశలు తగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. అయితే చివరి రెండు వారాలు నాగార్జున వచ్చే శని ఆదివారాలు మాత్రం భారీ వ్యూస్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. గ్రాండ్ ఫైనల్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు కానీ క్రిస్మన్ లోపే అని ఇన్ సైడ్ టాక్.

gamdomCasibommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş