iDreamPost
android-app
ios-app

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు(మంగళవారం)ఉదయం తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి సమీపంలో గరుడ స్టీల్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

తుఫాన్ వాహనానికి అడ్డుగా వచ్చిన ఎద్దును తప్పించబోయే క్రమంలో లారీని బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి ఆందోళకరంగా ఉందని సమాచారం. ప్రమాదానికి గురైన వారంతా తాడిపత్రి మెయిన్ బజార్‌కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.