iDreamPost
android-app
ios-app

RK Kotha Paluku – పట్టాభికి వత్తాసు.. ఎప్పటిలా తిరకాసు..

  • Published Oct 24, 2021 | 8:16 AM Updated Updated Oct 24, 2021 | 8:16 AM
RK Kotha Paluku – పట్టాభికి వత్తాసు.. ఎప్పటిలా తిరకాసు..

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై బూతు మాటలతో దాడి చేసి ఆంధ్రప్రదేశ్ లో అశాంతికి కారణమైన తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని సమర్థించడానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకును అంకితం ఇచ్చేశారు. పట్టాభి అలా మాట్లాడడం తప్పు అంటూనే అందుకు కారణం మాత్రం ఆయన కాదు ఆ పదం అర్థం తెలియక పోవడం అని నిర్థారించేశారు. పైగా తెలుగునాట కొన్ని పదాలకు అర్థం తెలియకుండా వాడడం అనేది ఎప్పటి నుంచో ఉందని వెరైటీగా వెనకేసుకు వచ్చారు.

ఒక తప్పునకు రెండు శిక్షలా అంటూ వింత ప్రశ్న..

పట్టాభి బూతులు మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఇంటిపైన, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు జరిగాయని, దాంతో అకౌంట్ సెటిల్ అయిపోయింది కదా మళ్లీ అతన్ని అరెస్ట్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. ఒక తప్పునకు రెండు శిక్షలు వేస్తారా? అని రాసి మాం…….చి లీగల్ పాయింట్ వెలికి తీశానని మురిసిపోయారు. తన మేధో మథనంతో ఈయనగారు కనిపెట్టే ఇలాంటి లీగల్ పాయింట్లతో ఇండియన్ పీనల్ కోడ్ ను తిరగరాస్తే బాగుండును. అప్పుడు పోలీసులకు కేసులు కట్టడం, అరెస్టు చేయడం వంటి పనులు ఉండవు. రాజకీయాలు జుగుప్సాకరంగా మారిపోయాయని ఆవేదన చెందిన రాధాకృష్ణ 
తన వ్యాసం ఆసాంతం వాస్తవాల వక్రీకరణకు పాల్పడి జర్నలిజాన్ని కూడా జుగుప్సాకరంగా మార్చేస్తున్నాను అన్న సంగతి మర్చిపోయారు. జనం అందరికీ తెలిసిన విషయాలనే తప్పుగా అన్వయిస్తూ తెలుగుదేశం పార్టీకి మైలేజీ తేవాలనే ఈయన తాపత్రయాన్ని చూస్తే జాలేస్తుంది.

ఎన్టీఆర్ తిట్టినది బాబునే..

పట్టాభి ఎపిసోడ్లో సీఎం జగన్ ఆస్కార్ స్థాయిలో నటించారని కువిమర్శలు చేసిన రాధాకృష్ణ వాటిని సమర్థించుకోవడానికి ఒక చారిత్రక వాస్తవాన్ని వక్రీకరించారు. రాజకీయ నాయకులు తమ కన్నా గొప్ప నటులని ఒక సందర్భంలో ఎన్టీఆర్ అన్నారని, జగన్ ఇప్పుడు ఆ విధంగా నటిస్తున్నారు అని 
రాశారు. అయితే ఎన్టీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినది వెన్నుపోటుతో తనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపిన చంద్రబాబును ఉద్దేశించి. జామాత దశమ గ్రహం, నీచుడు, విశ్వాస ఘాతకుడు వంటి పదాలతో ఎన్టీఆర్ తన అల్లుడు చంద్రబాబును తిట్టారు. ఆ సందర్భంలోనే నా కన్నా గొప్ప నటుడు చంద్రబాబు అని అన్నారు.

Also Read : ABN Andhra Jyothi : బాబు – రాధాకృష్ణల కాంట్రాక్టు ప్రేమ

తన బాస్ చంద్రబాబునాయుడును తిట్టిన తిట్లన్నీ వదిలేసి, అందులో ఒక వ్యాఖ్యను పట్టుకొచ్చి జగన్మోహనరెడ్డికి తప్పుగా అన్వయించి బదనాం చేయాలని చూశారు. అసలు పట్టాభి బోసిడీకే (లంజ కొడుకు) అని జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి అన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అన్నారా? అన్నది తేలవలసి ఉందని, పట్టాభి బయటకు వచ్చి చెప్పే వరకు ఆ విషయం తెలియదని రాశారు. బోసిడీకే పదానికి అర్థం తెలియకపోవడం వల్లే అలా అన్నానని పట్టాభి టీడీపీ నాయకులకు వివరణ ఇచ్చినట్టు మరోచోట రాశారు. ఇలా రకరకాలుగా మెలికలు పెడుతూ తన తిరకాసు రాతలతో విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు.

జనం పశ్చాత్తాప పడుతున్నారట..

గత ఎన్నికల్లో చేసిన తప్పునకు జనం పశ్చాత్తాప పడుతున్నారని వారందరూ బీపీ తెచ్చుకుని దాడులకు దిగకపోవడం రాష్ట్రం చేసుకున్న అదృష్టం అని రాసేశారు. అలాగే ఎక్కువ ధరలకు నాసిరకం మద్యం అమ్ముతున్నందుకు మందు బాబులు బీపీ పెంచుకోలేదని రాస్తూ వారంతా ప్రభుత్వంపై దాడులకు తెగపడితే బాగుండును అనే తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు. అలాగే సందర్భం లేకపోయినా వైఎస్ విజయమ్మ, షర్మిల పేర్లను, వివేకానందరెడ్డి హత్య కేసును ఎప్పటిలాగే తన తలాతోకా లేని రాతలో జొప్పించేశారు. సైబరాబాదు పురోగతిని చూసి జనం చంద్రబాబునాయుడును మెచ్చుకుంటున్నారని, త్వరలో రాష్ట్రం ఫ్యాక్షన్ జోన్ గా మారబోతోందని తాను కనిపెట్టిన విషయాన్ని కూడా ఏ మాత్రం దాచుకోకుండా పాఠకులతో పంచుకున్నారు.

Also Read : రొడ్డ కొట్టుడు.. రెచ్చగొట్టుడు..

పోలీసులపై అక్కసు..

వైఎస్సార్ సీపీ నాయకులను రక్షించడానికే పోలీసులు పనిచేస్తున్నారని నిరాధార ఆరోపణ చేశారు. రాష్ట్రం మత్తులో జోగుతోందని, ఒకప్పుడు రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్.. ఇప్పుడు అన్ని జిల్లాలకు విస్తరించిందని రాసేశారు. పోలీసులకు జీతాలు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఇస్తున్నారా? ఈ విషయంపై సమాధానం చెప్పకపోతే డీజీపీ ఆ పదవికి అర్హత కోల్పోయినట్టే అంటూ సగటు టీడీపీ నాయకుడి కంటే దిగజారి విమర్శించారు.

తనను నీచంగా దుషించడం వల్లే అభిమానులకు బీపీ పెరిగి దాడులకు దిగారని జగన్ సమర్థించు కుంటున్నారని, భవిష్యత్తులో నేరాలు చేసిన వారందరూ తనకు బీపీ ఉందని చెబితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. అలాంటివారిపై కేసులు కూడా పెట్టరా అని పోలీసులను నిలదీశారు. ఆ విధంగా శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులపై తన యజమాని చంద్రబాబు మాదిరిగా అక్కసు వెళ్లగక్కారు.

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులట!

ప్రశ్నించేవారిని భయపెట్టి, కేసులు పెట్టి లొంగదీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.. ఏబీఎన్,ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడులు చేయాలని ఆలోచన చేస్తున్నారు.. అది కూడా హైదరాబాద్ లోని కార్యాలయాలపైనే అని తెలిసినట్టు రాశారు. తన ఆప్తుడు కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక జగన్ హైదరాబాద్ ను ఎంచుకున్నారని రాశారు. దిగజారుడు తనానికి పరాకాష్టగా అనిపించే ఈ వ్యాఖ్యలను ఎవరైనా నమ్ముతారా? ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మీడియా హౌస్ పై దాడి చేయాలని నిర్ణయించడం , అది కూడా ఫలానా చోట అని అనుకోవడం, అది రాధాకృష్ణ గారి దివ్యదృష్టి కి తెలిసిపో వడం, ఎంత చక్కటి రాతలు!

అంటే ఇప్పుడు కేసీఆర్ తో కలసి జగన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి పథకం వేశారు కనుక వెంటనే కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఈయన గారి కలానికి రక్షణ కల్పించాలేమో! కొత్తపలుకు రాసే సమయానికి రాధాకృష్ణ కలానికి స్పృహ ఉంటుందో లేదో తెలియదు కానీ అది చదివేవారికి మాత్రం రెండు కళ్ళూ తెరుచుకుంటాయి.

Also Read : ABN RK Kothapaluku – కొత్త విషయం ఏముంది..?