iDreamPost
android-app
ios-app

గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?

  • Published Feb 01, 2023 | 3:43 PM Updated Updated Feb 01, 2023 | 3:43 PM
గీత గోవిందం 2 ప్లానింగ్ నిజమేనా?

అయిదేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన గీత గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్ లో రూపొంది గీత ఆర్ట్స్ బ్యానర్ కు కామధేనువులా కాసుల వర్షం కురిపించిన వైనం అంత సులభంగా మర్చిపోయేది కాదు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య కెమిస్ట్రీ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. దానివల్లే తిరిగి ఆ ఇద్దరు కోరిమరీ డియర్ కామ్రేడ్ లో నటించారు. ఇంకేం ఇంకేం కావాలే పాట తాలూకు సెన్సేషన్, సిద్ శ్రీరామ్ కు వచ్చిన పాపులారిటీ విపరీతం.

ఇప్పుడీ ఆల్ టైం హిట్ కి సీక్వెల్ రూపొందించే ప్రతిపాదన ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దర్శకుడు పరశురామ్ కి స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టమని చెప్పినట్టు వినికిడి. సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమా చేసినా తర్వాత ప్రాజెక్టుని లాక్ చేసుకోవడంలో పరశురామ్ కు టైం కలిసి రావడం లేదు. మహేష్ బాబుని డీల్ చేసిన విధానం, కమర్షియల్ కథను సరైన రీతిలో చెప్పలేకపోయిన తీరు జెనరల్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీనికి తోడు నాగచైతన్య కోసం సిద్ధం చేసిన కథ మీద ఎంతకీ ఏకాభిప్రాయం రాకపోవడం మరో ట్విస్ట్

సీక్వెల్స్ బాగా వర్కౌట్ అవుతున్న ట్రెండ్ లో గీత గోవిందం నిజంగా తెరకెక్కితే మంచి ఐడియానే. ఇప్పుడీ సెకండ్ పార్ట్ లో విజయ్ రష్మికల జంటకు పెళ్ళయాక ఈగో సమస్యలతో ఇద్దరు ఎదురుకునే సమస్యలతో పాటు అన్నయ్య సుబ్బరాజుకు సంబంధించిన ఏదైనా కొత్త ట్విస్టు లాంటిది పెట్టి డిఫరెంట్ గా తీసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషిని పూర్తి చేయడంతో పాటు గౌతమ్ తిన్ననూరితో చేయబోయే పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రష్మిక మందన్న పుష్ప 2 ది రూల్ సెట్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతోంది. చూడాలి ఈ సీక్వెల్ కి ఏ మేరకు ముందడుగులు పడతాయో

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş