iDreamPost
android-app
ios-app

ఇండియాలో కూడా ఇంత దారుణమా.. రష్మీ ఆవేదన..

  • Published Jun 22, 2022 | 10:00 AM Updated Updated Jun 22, 2022 | 10:00 AM
ఇండియాలో కూడా ఇంత దారుణమా.. రష్మీ ఆవేదన..

బుల్లితెర యాంకర్ గా రష్మీ బాగా పాపులారిటీ సంపాదించింది. ఇప్పటికే పలు టీవీ షోలతో బిజీగా ఉన్నా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరిపిస్తూ ఉంటుంది. ఇక తన సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. కేవలం తన హాట్ ఫొటోలే కాకుండా జంతువులపై జరుగుతున్న దాడుల గురించి కూడా పోస్టు చేస్తూ ఉంటుంది రష్మీ.

రష్మీ జంతువులని ప్రేమిస్తుందని అనేక సందర్భాలలో చెప్పడమే కాదు ప్రూవ్ చేసింది కూడా. కరోనా టైములో ఎన్నో జంతువులకి తానే స్వయంగా ఆహరం తీసుకెళ్లి పెట్టింది. జంతువులపై దాడి చేసే ఘటనలపై, వాటికి హాని కలిగించే విషయాలపై రష్మీ కచ్చితంగా స్పందిస్తుంటుంది. అలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఖండిస్తోంది. ఇప్పటివరకు అలా చాలా పోస్టులు చేసింది. జంతువులకు తన వంతు సపోర్ట్ కూడా చేస్తుంది రష్మీ.

అలాగే తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి ఎమోషనల్ అయింది రష్మి. ఓ ఆవును తాడుతో కట్టి ఈడ్చుకెళ్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది రష్మీ. ఈ వీడియోని పోస్ట్ చేసి.. ఇండియాలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఉందా. ఆవును గోమాత అని పిలిచే ఇండియాలో ఇంతకంటే దరిద్రం ఉండదు. జంతు చర్మంతో తయారు చేసిన వస్తువులను కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనకి తాగడానికి పాలు ఎక్కడ నుండి వస్తున్నాయో మర్చిపోకండి అంటూ పోస్ట్ చేసింది. దీంతో కొందరు రష్మీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞjojobetjojobet girişgamdomgrandpashabetCasibomjojobet girişholiganbet girişMarsbahis