iDreamPost
android-app
ios-app

రామోజీ, రాధాకృష్ణకు రాకూడని కష్టమొచ్చింది

  • Published Sep 20, 2020 | 6:45 AM Updated Updated Sep 20, 2020 | 6:45 AM
రామోజీ, రాధాకృష్ణకు రాకూడని కష్టమొచ్చింది

అసూయ హద్దులు దాటితే ఎలా ఉంటుందో తెలుసా. ఈర్ష్య కట్టలు తెంచుకుంటే ఎక్కడికి దారితీస్తుందో తెలుసా.. స్పష్టంగా తెలియాలంటే రామోజీ రాతల్లోనూ, రాధాకృష్ణ బాధల్లోనూ బాహాటంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్ సర్కారు పట్ల వారిలో కూడగట్టుకున్న వ్యతిరేకత నిలువునా ప్రస్ఫుటం అవుతుంది. నిన్నటి వరకూ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని వాపోయారు. ఇప్పుడు ఏకకాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుండడం సహించలేకపోతున్నట్టు స్పష్టమవుతోంది. పైగా పారదర్శకంగా చేపడుతున్న పనుల పట్ల కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది.

ఓవైపు రాజకీయంగా చంద్రబాబు ప్రతిష్ట కుదేలవుతుందనే కలవరం. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యకలాపాలతో సహించలేనితనం ఆ ఇద్దరిలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రోడ్లన్నీ అభివృద్ధి చేసేందుకు భారీగా ప్రణాళిక వేసి ప్రభుత్వం పనులకు శ్రీకారం చుడుతోంది. దానికి తగ్గట్టుగా ఎన్‌డీబీ రుణంతో ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో టెండర్ల విషయంలో గ్లోబల్ టెండర్లు పిలిచి బిడ్డింగులపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రపంచ బ్యాంకు సూచించిన నిబంధనల మేరకే అర్హత ప్రమాణాలను నిర్దేశించి ముందుకు సాగుతోంది.

ఇది సహించలేని పచ్చ మీడియాకు కంటగింపుగా మారింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేనితనం బయటపెట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే తమ పత్రికల్లో ఇష్టారాజ్యంగా కథనాలు వండి వార్చుతున్నాయి. విషం జల్లడం, విద్వేషం నింపడం తమ సహజ లక్షణాలను చాటుకుంటున్నాయి. రోడ్ల టెండర్ల విషయంలో సీమ కాంట్రాక్టర్లకు ఎక్కువగా బిడ్డింగ్ లో దక్కడం పట్ల మనసులో వ్యతిరేకతను మందిలో చాటుకుంటున్నారు. సీమ ప్రాంతీయులకు కాంట్రాక్టులు రాకూడదనే గుడ్డి వ్యతిరేకతోనో లేక తమకు అనుకూలంగా ఉన్న వారికి అవకాశం రాలేదనే దుగ్ధనో బహిరంగం చాటుకుంటున్న తీరు సహించడానికి సర్కారు కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపించం లేదు.

కేవలం జాతీయ బ్యాంకుల ద్వారా సదరు సంస్థలు లావాదేవీలు చేయాలన్న నిబంధన మాత్రమే జ్యుడీషియల్ ప్రివ్యూ లో సూచించిన విషయం విస్మరించి వార్తలు రాసేస్తున్నారు. బిడ్ల నుంచి రివర్స్ టెండర్ల వరకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్‌డీబీ పర్యవేక్షణలో సాగుతున్న సంగతిని దాచేస్తున్నారు. నిబంధనలు కఠినంగా ఉండడంతో తక్కువ బిడ్లు దాఖలయిన వాస్తవాన్ని వక్రీకరిస్తున్నారు. మొత్తంగా జగన్ ప్రభుత్వం మీద తమకున్న ఆక్రోశం జనమందిరిలో రావాలని ఆశిస్తూ పదే పదే అర్థసత్యాలను ఆశ్రయిస్తున్న తీరు విడ్డూరంగా కనిపిస్తోంది. ఆరుద్ర బాధ ప్రపంచ బాధ అన్నట్టుగా రామోజీ, రాధాకృష్ణలు తమలోని సహించలేని తనం సామాన్యులకు కూడా కలిగించాలనే దురాశతో సాగుతున్న తీరు విస్మయకరంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలకు విరుగుడుగా ప్రభుత్వం కూడా ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చట్టపరంగానే వారికి చెక్ పెట్టే ప్రయత్నం సాగుతున్నట్టు చెప్పవచ్చు.