iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ 168 టైటిల్ లీక్ ?

  • Published Jan 24, 2020 | 10:05 AM Updated Updated Jan 24, 2020 | 10:05 AM
సూపర్ స్టార్ 168 టైటిల్ లీక్ ?

ఒకప్పుడు బాషా, నరసింహ లాంటి బ్లాక్ బస్టర్స్ తో తెలుగులో బలమైన మార్కెట్ ని ఏర్పరుచుకున్న సూపర్ స్టార్ రజనికాంత్ కు గత కొన్నేళ్ళుగా తెలుగులో ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఒక్కటంటే ఒక్కటి కనీసం యావరేజ్ సక్సెస్ కూడా తలైవా అందుకోలేకపోతున్నాడు. కథానాయకుడు, కాలా, కబాలి, పేట ఇలా వరసగా ఒకదాని వెంట మరొకటి తుస్సుమనగా ఇటీవలే వచ్చిన దర్బార్ ఫలితం కూడా నిరాశ పరిచింది. సంక్రాంతి పండగ పుణ్యమాని వసూళ్లు బాగానే దక్కించుకున్నప్పటికి ఫైనల్ రిజల్ట్ మాత్రం ఫ్లాపే.

ఇదిలా ఉండగా మూడేళ్ళ నుంచి ఫుల్ స్పీడ్ తో ఉన్న రజని కొత్త మూవీ షూటింగ్ సైతం శరవేగంగా సాగుతోంది. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టుగా కోలీవుడ్ టాక్. అందులో ఒకటి అన్నతా. అంటే పెద్దన్నయ్య అని అర్థం. మరొకటి మన్నన్. మగాడు లేదా మొగుడు అనే అర్థం తీసుకోవచ్చు. తెలుగు వెర్షన్ కు వీటిలో ఒక పేరు పెట్టొచ్చు.

కోలీవుడ్ లో ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ సినిమాలు తీయడంలో పేరు తెచ్చుకున్న శివ ఇప్పటికే అజిత్ కు మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. తెలుగులో శౌర్యం,శంఖం, దరువు తీసిన శివ ఇక్కడ హిట్లు రాక తమిళ్ కు షిఫ్ట్ అయ్యాడు. ఇప్పుడు హయ్యెస్ట్ పెయిడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారాడు. వేసవి లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో నిన్నటి తరం హీరోయిన్లు మీనా, కుష్బూలతో పాటు కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. టైటిల్ ని మరికొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş