తమిళనాట ప్రసిద్ధిగాంచిన జల్లికట్టు క్రీడను వీక్షించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు తమిళనాడుకు రానున్నారు. నిజానికి తమిళనాడులో ఈ నెల చివరన మూడు రోజులపాటు పర్యటించాల్సిన రాహుల్ గాంధీ ఇలా అకస్మాత్తుగా ఒక్కరోజు పర్యటనకు రావడం ఆశ్చర్యం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
తమిళులు అత్యంత వైభవంగా జరుపుకునే జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు రాహుల్ గాంధీ రావడం వెనుక ఉద్దేశ్యం తమిళ ఓటర్లను ఆకర్షించేందుకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు రాహుల్ తమిళనాడులోని మదురై జిల్లా అవనియాపురం రానున్నట్లు టీఎన్‌సీసీ కార్యాలయానికి కబురందడంతో కాంగ్రెస్‌తో పాటు డీఎంకే నేతలు కూడా ఘన స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. జల్లికట్టు క్రీడ వీక్షించిన అనంతరం సంక్రాంతి సంబరాలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలుస్తోంది.