iDreamPost
android-app
ios-app

Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు త్వరలో శుభవార్త ?

  • Published Jan 21, 2022 | 11:02 AM Updated Updated Jan 21, 2022 | 11:02 AM
Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు త్వరలో శుభవార్త ?

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ వెయిటెడ్ లిస్టు టాప్ 3 లో ఉన్న రాధే శ్యామ్ కు కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసే క్రమంలో టీమ్ సీరియస్ ఆలోచనలు చేస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మార్చి 18ని ప్రాధమికంగా లాక్ చేసినట్టు తెలిసింది. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ అప్పటికి ఉండే సాధ్యాసాధ్యాలను యువితో పాటు టి సిరీస్ సంస్థ సీరియస్ గా పరిశీలిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకా తగ్గకపోవడంతో పాటు ఆందోళన కలిగించేలానే కేసులు నమోదు కావడం ఎవరినీ నిర్ణయం తీసుకునేలా చేయడం లేదు. ఈ కారణంనే పెద్ద ప్రొడక్షన్ హౌసులన్నీ మౌనమే నా బాష అంటూ ఏ అప్ డేట్ ఇవ్వడం లేదు.

ఒకవేళ మార్చి 18 నిజంగా ఫిక్స్ అయితే మంచి డేట్ అనే చెప్పొచ్చు. ఆ టైంలో పెద్దగా పరీక్షలు ఉండకపోవచ్చు. ఉన్నా వాటివల్ల కలెక్షన్లు మరీ తీవ్రంగా ప్రభావితం చెందవు. గతంలో రంగస్థలం ఈ నెలలోనే వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. సో సీజన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏప్రిల్ లో ఆల్రెడీ కెజిఎఫ్ 2, బీస్ట్, లాల్ సింగ్ చద్దా, ఆచార్య, ఎఫ్3 ఉన్నాయి. వీటి మధ్యలో రాధే శ్యామ్ ని ఇరికించడం కష్టం. లేనిపోని అభ్యంతరాలు వస్తాయి. ఆర్ఆర్ఆర్ ఏం చేస్తుందనేది అంతు చిక్కకపోయినా ముందే డేట్ మీద కర్చీఫ్ వేసేస్తే నిశ్చింతగా ఉండొచ్చనేది యువి ఆలోచనగా కనిపిస్తోంది. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి.

సాహో తర్వాత ఇంత గ్యాప్ తో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. ట్రైలర్ మాస్ ని మరీ గొప్పగా మెప్పించనప్పటికీ అసలు సినిమాలో మ్యాటర్ ఇంకో లెవెల్ లో ఉంటుందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ట్విట్టర్ లో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. త్వరలోనే శుభవార్త వింటారని ఊరిస్తున్నాడు. పాటలు వచ్చేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది. నేషనల్ ఈవెంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. డెసిషన్ తీసుకున్నాక కొత్తగా మళ్ళీ ప్రోగ్రాంస్ ని ప్లాన్ చేస్తారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూరుస్తున్నాడు

Also Read : Puneeth Rajkumar : ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం ఇది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alJojobet girişJojobet girişberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş