iDreamPost
android-app
ios-app

నలుగురు క్వీన్లకు మోక్షం ఎప్పుడో

  • Published Feb 12, 2020 | 9:49 AM Updated Updated Feb 12, 2020 | 9:49 AM
నలుగురు క్వీన్లకు మోక్షం ఎప్పుడో

బాలీవుడ్ లో ఆరేళ్ళ క్రితం సెన్సేషనల్ హిట్ గా నిలిచి కంగనా రౌనత్ కు కీర్తి, కనకం రెండూ తెచ్చిన క్వీన్ రీమేక్ ని సౌత్ లో భారీగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళ్ లో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లతో ఒకేసారి షూటింగ్ మొదలుపెట్టారు. మధ్యలో ఏవేవో ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్లు తగిలినా అలా అలా ఆపుతూ సాగుతూ మొత్తానికి అయ్యిందనిపించారు.

తెలుగు వెర్షన్ కు దర్శకుడూ మారాడు. మొదట నీలకంఠ టేకప్ చేయగా ఎందుకో మిడిల్ డ్రాప్ అయ్యారు. బాలన్స్ పార్ట్ ని అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ పూర్తి చేశాడు కానీ టైటిల్ కార్డ్స్ లో తన పేరు వేయొద్దనే షరతు మీద పని కానిచ్చాడు. మరోవైపు మిగిలిన మూడు భాషలకు దర్శకులు మారారో లేదో కానీ అవి కూడా ఎట్టకేలకు ఫైనల్ కాపీ రెడీ చేసుకున్నాయి. కానీ గత కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్ డేట్స్ దీనికి సంబంధించి రావడం లేదు. బిజినెస్ జరగకనో లేక పోస్ట్ ప్రొడక్షన్ లో ఏదైనా సమస్య వచ్చిందో తెలియదు కానీ పెట్టుబడి పెట్టిన నిర్మాత మాత్రం ఎక్కడున్నారో అర్థం కావడం లేదు.

పోనీ యాక్ట్ చేసిన హీరోయిన్లు అల్లాటప్పా బ్యాచా అంటే అదీ కాదు. ఆయా లాంగ్వేజెస్ లో క్రేజ్ ఉన్నవాళ్లే. మరి ఇది అర్ధాంతరంగా విడుదల ఎందుకు ఆగిపోయిందనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు. ట్విస్ట్ ఏంటంటే వీటి తాలూకు టీజర్లు కూడా గతంలోనే వచ్చాయి. కాజల్ వెర్షన్ కు సంబంధించి చిన్న వివాదం కూడా రేగింది. అయినా కూడా తర్వాత ఎలాంటి కదలిక లేదు. చూస్తుంటే ఈ నలుగురు క్వీన్లకు ఇప్పుడే మోక్షం దొరకడం కష్టమే అనిపిస్తోంది. గతంలో గోపిచంద్ సినిమా ఒకటి ఇలాగే మార్నింగ్ షో పడే టైంకి ఆగిపోయి ఇప్పటికీ ల్యాబులో నుంచి బయటికి రాలేదు. క్వీన్ కు ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుతున్నారు ఆ హీరోయిన్ల అభిమానులు

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişcasibom