iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో సుకుమార్ – ఇన్ని సినిమాలు ఎలాగబ్బా

  • Published Dec 26, 2022 | 7:53 PM Updated Updated Dec 26, 2022 | 7:53 PM
ప్రభాస్ తో సుకుమార్ –  ఇన్ని సినిమాలు ఎలాగబ్బా

ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాలు బాగా తగ్గించేశాడని, రిలీజులు లేట్ అవుతున్నాయని ఫీలవుతున్న అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా డార్లింగ్ రెడీ అవుతున్నాడు. వరసగా సంతకాలు చేస్తూ రాబోయే అయిదారేళ్ళలో అసలు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టుగా వచ్చిన వార్త ఇటు ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 లాంటి బంపర్ హిట్స్ తో దూకుడు మీదున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ దీని కోసం వందల కోట్ల భారీ బడ్జెట్ ని సిద్ధం చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ అంతర్గతంగా చర్చలు జరిగాయని తెలిసింది. ప్రభాస్ కి అంత టైం ఎక్కడనే సందేహం రావడం సహజం. అదెలాగో చూద్దాం. సలార్ ప్రస్తుతం ముప్పాతిక శాతం పూర్తి చేసుకుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ 2024 వేసవి లోగా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ మీద పని మొదలుపెడతారు. ఆది పురుష్ ఎప్పుడో అయిపోయింది కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన టెన్షన్ ప్రభాస్ ది కాదు. కేవలం డబ్బింగ్ కు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మారుతీ డైరెక్షన్లో చేస్తున్న మరో చిత్రం గుట్టుచప్పుడు కాకుండా షూట్ జరుపుకుంటోంది

ప్రాజెక్ట్ కె విడుదల 2025లోనే కాబట్టి దానికి ఉరుకులు పరుగులు అవసరం లేదు. దర్శకుడు నాగ అశ్విన్ చాలా ప్లాన్డ్ గా షెడ్యూల్స్ వేసుకుంటున్నారు. సో ఒత్తిడేమి లేదు. సందీప్ రెడ్డి వంగాతో ప్లాన్ చేసుకున్న స్పిరిట్ విషయంలో ఇంకొంత క్లారిటీ రావాలి. అతను బాలీవుడ్ మూవీ యానిమల్ ని కనక టైంకి పూర్తి చేస్తే ఆ తర్వాత ప్రభాస్ తో జట్టు కట్టొచ్చు. కానీ అదంత సింపుల్ గా కనిపించడం లేదు. మరోవైపు సుకుమార్ పుష్ప 2 ది రూల్ ని రిలీజ్ చేసే నాటికి ఫ్రీ అవుతారు. 20024 వచ్చేస్తుంది. అప్పుడు కనక ప్రభాస్ తన కమిట్ మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుంటే వెంటనే ప్రభాస్ ది పట్టాలు ఎక్కించవచ్చు. మరి రామ్ చరణ్ ది ఏం చేస్తారో చూడాలి

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş