iDreamPost
android-app
ios-app

పవన్ 27 : వీరుడి రాజసం

  • Published Sep 02, 2020 | 7:24 AM Updated Updated Sep 02, 2020 | 7:24 AM
పవన్ 27 :  వీరుడి రాజసం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నిర్మాతలు పోటీ పడి మరీ ఇవాళ అప్ డేట్స్ ఇవ్వడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఉదయం వకీల్ సాబ్ కొత్త పోస్టర్ ని ఎంజాయ్ చేశాక తక్కువ గ్యాప్ లో 27వ సినిమా ప్రీ లుక్ వచ్చేసింది. ఇందులో పవన్ మొహం చూపించకపోయినా తన దుస్తులు ఎలా ఉంటాయన్న క్లూ ఇచ్చేసి ఆసక్తి పెంచారు. ఇది పీరియాడిక్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే ఇందులో వేషభాషలు ఉన్నాయి. భుజం మీద వేలాడుతూ నడుము దాకా సాగిన ఎర్రటి గుడ్డను చుట్టుకుని దానికి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న గద్ద బొమ్మను పెట్టడం కొత్తగా ఉంది.

అంతే కాదు చేతికి కడియం, ఉంగరాలు మొత్తం సెటప్ చూస్తుంటే పవన్ ఫస్ట్ టైం కెరీర్లో ఒక అద్భుతమైన పాత్ర చేయబోతున్న క్లారిటీ అయితే వచ్చేసింది. క్రిష్ దర్శకుడు కావడంతో ఇప్పటికే దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తో పాటు బంగారం నిర్మించిన ఏఎం రత్నం దీనికి ప్రొడ్యూసర్ కాబట్టి బడ్జెట్ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లోనూ ఏదో రాజప్రాసాదం దాని ముందు మూటలు మోస్తున్న కూలీలు మొత్తానికి కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగానే ఉంది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు. టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి తొలుత విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం జరిగింది కానీ ఇవాళ ప్రకటనలో దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు.

పోస్టర్ లో స్పష్టంగా 27 అని నెంబర్ ఇచ్చారు కాబట్టి వకీల్ సాబ్ తర్వాత వచ్చే సినిమా ఇదే. కరోనా నిబంధనల వల్ల దీని షూటింగ్ కి బ్రేక్ వేసిన క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రెండో సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది అయ్యేలోపు పవన్ కూడా వకీల్ సాబ్ నుంచి ఫ్రీ అవుతాడు. డిసెంబర్ లేదా జనవరి నుంచి పరిస్థితిని బట్టి ఈ సినిమా షూటింగ్ ని కంటిన్యూ చేయబోతున్నారు. బాలీవుడ్ నుంచి జాక్వలిన్ ఫెర్నాన్డెజ్, అర్జున్ రాంపాల్ తో పాటు మలయాళీ ఫేమ్ జయరాం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాయుధ పోరాటంలో యుద్ధం చేసిన ఓ బందిపోటు దొంగగా ఈ కథ ఉంటుందని టాక్. మొత్తానికి ఫేస్ చూపించకపోయినా రాజసం ఒలికించే వీరుడిగా పవన్ ఏదో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న స్పష్టత వచ్చింది కాబట్టి ఆ కోణంలో అభిమానులు ఆనందపడాల్సిందే