iDreamPost
android-app
ios-app

జగన్ ప్రజా సంకల్ప యాత్ర-1

  • Published Nov 06, 2019 | 3:37 AM Updated Updated Nov 06, 2019 | 3:37 AM
జగన్  ప్రజా సంకల్ప యాత్ర-1

23-May-2019…. కొన్ని కోట్ల మందికి కంటిమీద కునుకు లేని దీర్ఘ రాత్రి అతి భారంగా గడిచి సమయం 8 గంటకొట్టింది… పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి… వైసీపీ శ్రేణులలో గెలుపు నమ్మకం బలపడటం, టీడీపీ శ్రేణుల్లో అపజయం భయం మొదలయ్యింది.

మొదటి గంట కౌంటింగ్ ముగిసే సరికి వైసీపీ విజయం పక్కా అని తేలింది,టీడీపీ దింపుడు కళ్లెం ఆశలు వొదులుకుంది రెండో  గంట గడిచేసరికి వైసీపీ 150 సీట్లు దాటుతుందా?అన్న  మొదలయ్యింది.. మూడో గంట టీడీపీ కి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా?అనుమానం … అంతిమంగా వైసీపీ 151 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. 

294 స్థానాలున్న ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు 148 … కేవలం 175 స్థానాలు ఉన్న విభజిత ఆంధ్ర శాసనసభలో వైసీపీ ఏకంగా 151 స్థానాలు గెలవటం “క్లీన్ స్వీప్” అన్న పదానికి సరికొత్త అర్ధం నిర్వచించింది. 

ఈ విజయానికి తోలి నాది పడింది సరిగ్గా 2 సంవత్సరాల కింద ఇదే రోజు!జగన్ “ప్రజా సంకల్ప యాత్ర” ను 06-Nov-2017 నాడు ఇడుపుల పాయలో మొదలుపెట్టారు. అప్పటి వరకు నిత్యం చంద్రబాబు ప్రచారహడావుడిని రోజంతా చూపిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా,పేజీలు పేజీలు వార్తలు రాసిన ప్రింట్ మీడియా జగన్ ప్రజాసంకల్పయాత్రను పట్టించుకోవలసిన విధిలేని పరిస్థితి ఏర్పడింది.కనీసం సభలు సరిగా జరగలేదని,ప్రజల హాజరు తక్కువగా ఉందని ఎదో ఒక వార్తా రాయటం మొదలుపెట్టారు. 

అప్పటి వరకు స్థబ్దుగా  ఉన్న వైసీపీ శ్రేణులు ఉత్సహంగా పాదయాత్రలో పాల్గొన్నాయి.ఒక వైపు MLAలను టీడీపీ లాకుంటున్నా ఆయా నియోజకవర్గాలలో ద్వితీయశ్రేణి నాయకత్వం పాదయాత్రను దిగ్విజయం చేశారు. 

పాదయాత్ర మొదలయిన తరువాత రాష్ట్రం యావత్తు దృష్టిని ఆకర్షించింది “కదిరి” లో జరిగిన యాత్ర. కదిరి MLA వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించాడు,ఈ కసితో వైసీపీ శ్రేణులు భారీ జన సమీకరణ చేశాయి… ఊరు పగిలిపోతుందా అన్నట్లు ఇసుక వేస్తే కింద రాలనంత మంది ప్రజలు వొచ్చారు… అక్కడి నుంచి ప్రజాసంకల్ప యాత్ర నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. 

ఒక్కో నది దాటుతుంటే ఆ బ్రిడ్జిలు కూలిపోతాయా అన్నట్లు యాత్ర సాగింది. యాత్ర పెన్నా,కృష్ణ ,గోదావరి బ్రిడ్జిలు దాటించటం అధికారులకు తలకు మించిన పనిఅయ్యింది. రాజమండ్రి బ్రిడ్జ్ కొన్ని సెకన్ల పాటు ఊగింది… 

ఇవన్నీ భౌతిక విషయాలు…జగన్ నడిచిన ఒక్కో అడుగు  కార్యకర్తల గుండెల్లో గెలుపు మీద కసిపెంచింది. టీడీపీకి ఎలెక్షనీరింగ్ పెట్టిన విద్య కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు చేసిన ఎలెక్షనీరింగ్ ముందు టీడీపీ బిత్తరపోయి చూడటం తప్ప తటస్థుల ఓట్లు వేయుంచుకునే మార్గం కనుగొనలేకపోయారు. 

ప్రజాసంకల్ప యాత్రలో జగన్  06-Nov-2017 నుంచి 09-Jan-2019 మధ్య 14 నెలలు  341 రోజుల పాటు 134 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మొత్తం 3648 కి.మీ నడిచి ఇచ్చాపురం వద్ద ముగిసింది. 

స్వతంత్ర భారతదేశంలో  మాజీ ప్రధాని చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లి వరకు చేసిన 4260 కి.మీ పాదయాత్ర తరువాత అంతటి  సుదీర్ఘ పాదయాత్ర జగన్ ప్రజాసంకల్ప యాత్ర. జగన్ ప్రజాసంకల్ప యాత్ర వివరాలు,దాని ఫలితాల మీద ఈ వారం iDeampost.com వరుస కధనాలు అందిస్తుంది.