ఇండస్ట్రీలో రెండు రకాల హీరోయిన్లు ఉంటారు. మొదటి రకం నటనతో పైకి రావాలని చూస్తుంటారు. సాయిపల్లవి బ్యాచ్ అన్నమాట. కానీ రెండోరకం కూడా ఉంటారు. వాళ్లే అందాల ఆరబోతతో పాటు అభినయాన్ని నమ్ముకుంటారు. అంటే సమంత టైప్ అన్నమాట. కానీ మూడోరకం ఉంటారండీ.. వాళ్లకు నటనతో పనిలేదు.. కేవలం అందాలు ఆరబోస్తే చాలు.. ప్రతీ సినిమాలోనూ వాళ్లను తీసుకునేది కూడా అందుకే. వాళ్ల పని వాళ్లు సరిగ్గా చేస్తుంటారు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా వాళ్లకు వచ్చే నష్టం కూడా ఉండదు. ఈ లిస్ట్ లోకి వచ్చే హీరోయిన్ ప్రగ్యజైస్వల్. కంచెలో అభినయంతో మెప్పించింది. కానీ అవకాశాలు రాకపోయే సరికి.. ఇప్పుడు అందాన్ని ప్రయోగిస్తుంది. కావాలంటే చూడండి.. మొన్న నక్షత్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధరంతేజ్ తో రెచ్చిపోయిన ప్రగ్యా.. ఆ సెగలు తగ్గకముందే బోయపాటి శీను జయ జానకి నాయకాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్రస్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ప్రగ్యాజైస్వల్. పైగా కెమెరాలన్నింటినీ ముద్దుగుమ్మల అందాలపైనే ఫోకస్ చేసాడు బోయపాటి. ఇక ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోనూ అమ్మాయిగారు కేవలం అందాల ఆరబోతతోనే మతులు పోగొడుతున్నారు. ఈమె అందాల ఆరబోత చూసి షాక్ అయిపోతున్నారు ప్రేక్షకులు. అసలే బాలీవుడ్ నుంచి వచ్చిన భామ కదా.. ఇక్కడ అసలు అడ్డూ అదుపులేమీ లేవు. మొన్నే నక్షత్రంలో బికినీ వేసింది. ఇప్పుడు మరోసారి సెగలు పుట్టించింది. మొత్తానికి హిట్లు లేకపోయినా కేవలం ఈమె అందాల ఆరబోత కోసమైనా పిలిచి మరి ఆఫర్లు ఇచ్చేలా ఉన్నారు దర్శక నిర్మాతలు.
320