iDreamPost
android-app
ios-app

Prabhas సలార్ విడుదల – చాలా లాంగ్ గురూ

  • Published Aug 15, 2022 | 2:02 PM Updated Updated Dec 23, 2023 | 11:30 AM
  • Published Aug 15, 2022 | 2:02 PMUpdated Dec 23, 2023 | 11:30 AM
Prabhas సలార్ విడుదల – చాలా లాంగ్ గురూ

నిన్నటి నుంచి అప్డేట్ పేరుతో తెగ ఊరించేసిన సలార్ టీమ్ ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది అది కూడా కొత్త పోస్టర్ తో. అయితే దీనికి చాలా వెయిటింగ్ పీరియడ్ పెట్టేసింది. ఏకంగా ఏడాదికి పైగా వేచి చూడమంటూ ఫ్యాన్స్ కి కొత్త పరీక్ష ఇచ్చింది. 2023 సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా సలార్ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ ఆలస్యం మాత్రం ఊహించనిది. ఆది పురుష్ ని ఎప్పుడు వదులుతారో ఇంకా ఆ నిర్మాతలు బయటపెట్టనేలేదు. సంక్రాంతికనే అంచనా అభిమానులలో ఉంది కానీ నిజంగా టి సిరీస్ ఆ డెడ్ లైన్ కి రీచ్ కాగలదా అంటే ఇప్పటికీ అనుమానంగానే ఉంది. పోనీ వేసవి అనుకుంటే దీనికి సలార్ కి తక్కువ గ్యాప్ ఉండిపోతుంది.


సరే చెప్పినంత మాత్రాన దానికే కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు కానీ 13 నెలల ముందే చెప్పేశారు కానీ వాయిదా అవకాశాలు ఉండవనే అనుకోవచ్చు. కెజిఎఫ్ రెండు భాగాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ అందులోనూ డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ కావడంతో హైప్ మాములుగా లేదు. బడ్జెట్ నాలుగు వందల కోట్ల దాకా పెడుతున్నారని ఇప్పటికే టాక్ ఉంది కానీ అదెంత మొత్తమో క్లియర్ గా తెలియాల్సి ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిగిలిన క్యాస్టింగ్ ఎవరున్నారో కూడా తెలియనంత గుట్టుగా షూటింగ్ జరిపించేస్తున్నారు.ప్రభాస్ ఉండగా వేరే కటవుట్ ఎందుకంటారా?

అయితే ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా కెజిఎఫ్ టైపులో సలార్ రెండు భాగాలు వస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ పోస్టర్ లో రిలీజ్ గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు తప్ప సీక్వెల్ కి సంబంధించిన హింట్ లేదు. సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్ల తర్వాత ఫ్యాన్స్ ఆశలన్నీ రాబోయే సినిమాల మీదే ఉన్నాయి. సలార్, ఆది పురుష్ లు కాకుండా ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతీ దర్శకత్వంలో మూవీ లైన్ లో ఉన్నాయి. ఏది ముందుకు ఏది వెనక్కు అనే దాని గురించి స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. సలార్ కూడా కెజిఎఫ్ ఫ్లేవర్ లో బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో డార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet giriş